భారతీయ సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ను 56వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం (IFFI) ఘనంగా సన్మానించింది. అభిమానులు ‘తలైవర్’ అని ముద్దుగా పిలుచుకునే 74 ఏళ్ల రజనీకాంత్‌కు.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సమాచార, ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, నటుడు రణ్‌బీర్ సింగ్ సమక్షంలో శాలువా, జ్ఞాపికను అందజేశారు.
రజనీకాంత్ గానే

ఈ సత్కారానికి కేంద్ర ప్రభుత్వానికి రజనీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా, నటన అంటే తనకు ఎంతో ఇష్టమని రజనీకాంత్ చెప్పారు. 50 ఏళ్ల ప్రస్థానం తనకు 10-15 ఏళ్లుగా అనిపిస్తుందని రజనీకాంత్ అన్నారు. "వంద జన్మలెత్తినా రజనీకాంత్‌గానే పుట్టాలని కోరుకుంటా" అని ఆయన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఫ్యామిలీ ఫొటో
ఇఫ్ఫి ముగింపు వేడుకలకు ముందు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో కుటుంబ ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో రజనీకాంత్, ఆయన భార్య లత, ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య కనిపిస్తున్నారు. ముదురు నీలం రంగు షర్ట్, బూడిద రంగు ప్యాంట్‌లో ప్రతిష్టాత్మక వేడుక కోసం రజనీకాంత్ రెడీ అయ్యారు.
ధనుష్ కొడుకులు
సౌందర్య రజనీకాంత్ పోస్ట్ చేసిన రజనీకాంత్ ఫ్యామిలీ పిక్ లో ధనుష్ కొడుకులు కూడా ఉన్నారు. రజనీకాంత్ మనవళ్లు కూడా అయిన యాత్ర రాజా, లింగా ఈ ఫొటోలో స్పెషల్ గా నిలిచారు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, ధనుష్ ల పెళ్లి 2004లో జరిగింది. 2006లో వీళ్లకు యాత్ర రాజా, 2010లో లింగ రాజా పుట్టారు. 2022లో విడిపోతున్నట్లు ధనుష్, ఐశ్వర్య ప్రకటించారు.
50 ఏళ్ల కెరీర్
బస్ కండక్టర్ నుంచి కోట్లాది అభిమానుల ఆరాధ్య హీరోగా మారారు రజనీకాంత్. ఆయన నట ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇఫ్ఫి ముగింపు వేడుకల్లో భాగంగా ఈ సన్మానం జరిగింది. రజనీకాంత్ తన అసమానమైన కృషికి గాను కేవలం తమిళ చిత్రాలకే కాకుండా హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు కూడా గుర్తింపు పొందారు.
{{/usCountry}}బస్ కండక్టర్ నుంచి కోట్లాది అభిమానుల ఆరాధ్య హీరోగా మారారు రజనీకాంత్. ఆయన నట ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇఫ్ఫి ముగింపు వేడుకల్లో భాగంగా ఈ సన్మానం జరిగింది. రజనీకాంత్ తన అసమానమైన కృషికి గాను కేవలం తమిళ చిత్రాలకే కాకుండా హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు కూడా గుర్తింపు పొందారు.
{{/usCountry}}గత ఐదు దశాబ్దాలలో 170కి పైగా చిత్రాలలో నటించిన రజనీకాంత్.. దాదాసాహెబ్ ఫాల్కే (2020), పద్మ భూషణ్ (2000), పద్మ విభూషణ్ (2016) వంటి అనేక అవార్డులు అందుకున్నారు. చివరగా ఈ ఏడాది వచ్చిన కూలీ సినిమాలో తన స్టైలిష్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇప్పుడు జైలర్ 2లో నటిస్తున్నారు. ఇది ఆయన సూపర్ హిట్ మూవీ జైలర్ కు సీక్వెల్.