...
...
Next Story

Kiss: మూవీలో తండ్రి పాత్ర- స్టేజీ మీద హీరోయిన్ సారా అర్జున్ భుజంపై ముద్దు- క్లారిటీ ఇచ్చిన ధురంధర్ 2 నటుడు రాకేష్ బేడీ

Rakesh Bedi About Sara Arjun Kiss Controversy: 'ధురంధర్ 2' ఘనవిజయంతో జోష్‌లో ఉన్న సీనియర్ నటుడు రాకేష్ బేడీ గతంలో తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానమిచ్చారు. తన కో-స్టార్ సారా అర్జున్ భుజంపై ముద్దు పెట్టిన విషయంపై రాకేష్ బేడీ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ట్రైలింగ్‌పై ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Mar 24, 2026, 12:51:44 IST
Advertisement

బాలీవుడ్ వెటరన్ నటుడు రాకేష్ బేడీ ప్రస్తుతం ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ సంతోష సమయంలోనే గతంలో తన చుట్టూ అల్లుకున్న ఒక వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు.

సారా అర్జున్‌ను పలకరించిన తీరుపై

మూవీలో తండ్రి పాత్ర- స్టేజీ మీద హీరోయిన్ సారా అర్జున్ భుజంపై ముద్దు- క్లారిటీ ఇచ్చిన ధురంధర్ 2 నటుడు రాకేష్ బేడీ
మూవీలో తండ్రి పాత్ర- స్టేజీ మీద హీరోయిన్ సారా అర్జున్ భుజంపై ముద్దు- క్లారిటీ ఇచ్చిన ధురంధర్ 2 నటుడు రాకేష్ బేడీ

గతేడాది నవంబర్‌లో ధురంధర్ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మూవీ హీరోయిన్ సారా అర్జున్‌ను ఆయన పలకరించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాకేష్ బేడీ ఆరోజు అసలేం జరిగిందో వివరించారు.

అసలు వివాదం ఏంటి?

'ధరంధర్' చిత్రంలో 71 ఏళ్ల రాకేష్ బేడీ రాజకీయ నాయకుడు జమీల్ జమాలిగా నటించగా 20 ఏళ్ల సారా అర్జున్ ఆయన కూతురు యాలీనా పాత్ర చేసింది. ధురంధర్ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాకేష్ బేడీ స్టేజ్ మీదకు రాగానే సారాను హత్తుకుని పలకరించారు. ఆ సమయంలో సారు అర్జున్ భుజంపై రాకేష్ బేడీ ముద్దు పెట్టినట్లుగా ఉన్న ఒక క్లిప్ వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు రాకేష్ బేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తండ్రిలా పలకరిస్తే తప్పుగా చూస్తారా?

ఈ విమర్శలపై రాకేష్ బేడీ తాజాగా ఘాటుగా స్పందించారు. "షూటింగ్ సమయంలో సారా ఎప్పుడు సెట్స్‌కు వచ్చినా నేను ఒక తండ్రిలా ఆమెను హత్తుకుని, నుదుటిపై ముద్దు పెట్టుకుని ప్రోత్సహించేవాడిని. ట్రైలర్ లాంచ్ రోజు కూడా అదే ప్రేమతో పలకరించాను. కానీ, జనం రకరకాలుగా రాశారు. నేను ఎప్పుడూ ఆమెను నా బిడ్డలాగే చూశాను" అని రాకేష్ బేడీ పేర్కొన్నారు.

జనం ఏదో ఒకటి అంటూనే ఉంటారు

"పబ్లిక్‌గా స్టేజ్ మీద, ఆమె (సారా అర్జున్) తల్లిదండ్రులు ఉన్నప్పుడే నేను చెడు ఉద్దేశంతో ఎందుకు ప్రవర్తిస్తాను? సోషల్ మీడియాలో ఏమీ లేని విషయాన్ని పెద్దది చేయడం కొందరికి అలవాటుగా మారింది" అని రాకేష్ బేడీ అసహనం వ్యక్తం చేశారు.

సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న 'జమీల్ జమాలి'

ఇక వివాదాలను పక్కన పెడితే రాకేష్ బేడీ ప్రస్తుతం 'ధరంధర్ 2' సాధిస్తున్న రికార్డు వసూళ్లతో చాలా సంతోషంగా ఉన్నారు. మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 చిత్రం ఇప్పటికే భారతదేశంలో రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

క్లైమాక్స్ ట్విస్ట్

రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రాకేష్ బేడీ పోషించిన రాజకీయ నాయకుడి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. క్లైమాక్స్‌లో జమీల్ జమాలి ఇచ్చే ట్విస్టుకు ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. ఇలాంటి భారీ హిట్ కెరీర్‌లో అరుదుగా వస్తుందని, ఈ విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నానని రాకేష్ బేడీ తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe