ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ‘ధురంధర్ 2’ మాటే వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్‌లో రణ్‌వీర్ సింగ్ తన యాక్షన్‌తో అదరగొడుతుంటే, సీనియర్ నటుడు రాకేష్ బేడీ తన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రతో సినిమాకే హైలైట్‌గా నిలిచారు. కరాచీకి చెందిన కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజకీయ నాయకుడు ‘జమాలి’ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి.
రణ్‌వీర్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్

ఇటీవల ‘ఇండియా పాడ్‌కాస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ బేడీ షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా చివరి రోజున రణ్‌వీర్ సింగ్ మైక్ తీసుకుని యూనిట్ అందరి ముందు తన గురించి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకున్నారు.
రాకేష్ జీ వల్లే వస్తాయి
"ఈ సినిమా ఒకవేళ వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే.. అందులో రూ. 500 కోట్లు కేవలం రాకేష్ జీ వల్లే వస్తాయి" అని రణ్‌వీర్ సింగ్ అన్నట్లు రాకేష్ బేడీ తెలిపారు. అంత పెద్ద మాట అనొద్దని తాను వారించినా, రణ్‌వీర్ మాత్రం అది తన మనసులో మాట అని గట్టిగా చెప్పారని రాకేష్ బేడీ వివరించారు.
డైరెక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు!
కేవలం హీరో మాత్రమే కాదు, దర్శకుడు ఆదిత్య ధర్ కూడా రాకేష్ బేడీ నటనకు ఫిదా అయ్యారట. "ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఇంతకంటే పెద్ద గౌరవం ఇంకేముంటుంది? షూటింగ్ చివరి రోజున ఆదిత్య నా భుజంపై చేయి వేసి.. 'సర్, ఈరోజు మీ షూటింగ్ పూర్తవుతుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి, మిమ్మల్ని చాలా మిస్ అవుతాను' అని చెప్పారు. సెట్‌లో అంతటి ఆత్మీయ వాతావరణం ఉండబట్టే సినిమా ఇంత బాగా వచ్చింది" అని రాకేష్ బేడీ ఆనందం వ్యక్తం చేశారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
కాగా మొదటి భాగం ‘ధురంధర్’ భారతదేశంలో రూ. 838.5 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1303.35 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు రెండో భాగం ధురంధర్ 2 అంతకు మించిన వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శిక్షణ కాలం నాటి కథ
{{/usCountry}}కాగా మొదటి భాగం ‘ధురంధర్’ భారతదేశంలో రూ. 838.5 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1303.35 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు రెండో భాగం ధురంధర్ 2 అంతకు మించిన వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శిక్షణ కాలం నాటి కథ
{{/usCountry}}ధురంధర్ ది రివేంజ్ మూవీలో రణ్‌వీర్ సింగ్ ‘హంజా అలీ మజారీ’గా ఎలా మారారు అనే శిక్షణ కాలం నాటి కథను చూపించబోతున్నారు. అర్జున్ రాంపాల్, రణ్‌వీర్ సింగ్‌ల మధ్య సాగే పోరాట దృశ్యాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి స్టార్స్ కూడా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.