...
...
Next Story

Ram Charan Birthday: రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే-ట్రోల్స్ నుంచి గ్లోబ‌ల్ స్టార్ వ‌ర‌కు-చెర్రీ కెరీర్‌ను మార్చిన టాప్‌-5 మూవీస్

Ram Charan Birthday: అతను హీరో ఏంటీ? సినిమాలు చేసేందుకు చిరంజీవి కొడుకు అయితే సరిపోతుందా?.. ఇలాంటి ట్రోల్స్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. ఈ రోజు చెర్రీ బర్త్ డే. ఈ సందర్భంగా అతని కెరీర్ ను మార్చిన టాప్-5 సినిమాలు, వాటి ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

Published on: Mar 27, 2026, 06:30:25 IST
Advertisement

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇప్పడు తండ్రి గర్వించే స్థాయికి చేరుకున్నాడు. 2007లో చిరుతతో అరంగేట్రం చేసిన చెర్రీ కెరీర్ స్టార్టింగ్ లో చాలా ట్రోల్స్ ఎదుర్కున్నాడు. చిరంజీవి కొడుకు అయితే సరిపోతుందా? హీరో కావాలంటే ఇంకేం అర్హత ఉండొద్దా అంటూ చరణ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటిని దాటి, అతను గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.

రామ్ చరణ్ బర్త్ డే

రామ్ చరణ్ (x/peddi)
రామ్ చరణ్ (x/peddi)

రామ్ చరణ్ బర్త్ డే ఈ రోజు (మార్చి 27). ఈ సందర్భంగా ట్రోల్స్ ను దాటి గ్లోబల్ స్టార్ గా మారిన చెర్రీ కెరీర్ లోని టాప్-5 సినిమాలపై ఓ లుక్కేద్దాం. వాటి ఓటీటీ వివరాలనూ కూడా ఇక్కడ చూసేయండి.

మగధీర

చిరుతతో డెబ్యూ చేసిన రామ్ చరణ్ లోని అసలైన యాక్టింగ్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ‘మగధీర’. 2009లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అప్పట్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాగా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసింది. చిరంజీవి కొడుకు యాక్టింగ్ అదరగొడుతున్నాడని రామ్ చరణ్ కు పేరు తెచ్చిన ఫిల్మ్ ఇది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

ఆరెంజ్

రిలీజ్ టైమ్ లో థియేటర్లలో అంతగా ఆడలేకపోయినా, ఇప్పుడు రి రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ ‘ఆరెంజ్’. ఇందులో లవర్ బాయ్ గా, నిజాలు మాత్రమే చెప్పే వ్యక్తిగా చెర్రీ అదుర్స్ అనిపించాడు. ఈ సినిమాతో చరణ్ యాక్టింగ్ లోని మరో యాంగిల్ బయటపడింది. ఆరెంజ్ మూవీని జీ5 ఓటీటీలో చూడొచ్చు.

ధృవ

చరణ్‌లోని అసలైన నటుడిని బయటకు తీసిన సినిమా రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో 'చిట్టిబాబు' పాత్రలో అతని యాక్టింగ్ అద్భుతం. చెవుడు ఉన్న పల్లెటూరి యువకుడిగా చరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. స్టార్‌డమ్ కంటే కూడా నటనకే ప్రాధాన్యతనిచ్చి చరణ్ చేసిన ఈ ప్రయోగం అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్

రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా మార్చిన మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్ చరణ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ కలిసి చేసిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ఈ మూవీతో రామ్ చరణ్ ఎలాంటి క్యారెక్టర్లు అయినా, ఎంతటి బలమైన పాత్రనైనా అలవోకగా ప్లే చేయగలడని అందరికీ తెలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ జీ5, నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe