...
...
Next Story

హద్దు మీరిన అభిమానం.. రామ్ చరణ్‌ ఆసుపత్రిలోకి వెళ్తుండగా సెల్ఫీలు అడిగిన ఫ్యాన్స్!

రామ్ చరణ్ భార్య ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రికి వచ్చిన సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను లోపలకు వెళ్లనివ్వకుండా అభిమానులు సెల్ఫీలు అడిగారు. దీంతో చిన్నపాపను ఎత్తుకున్న రామ్ చరణ్ ఇబ్బందిపడాల్సి వచ్చింది.

Published on: Feb 1, 2026, 17:45:58 IST
Advertisement

ఈ రోజుల్లో అభిమానుల అభిమానంతో సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అత్యుత్సాహంతో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ మీద ప్రభావం చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఫలితంగా తీవ్ర గందరగోళం నెలకొంటుంది. వారికి అసౌకర్యమైన ఫీలింగ్ వస్తుంది. ఫ్యాన్స్ కదా అని ఏం అనలేకపోతున్నారు సెలబ్రిటీలు. వారు బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. వారిని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తారు.

ఆసుపత్రి వద్ద రామ్ చరణ్
ఆసుపత్రి వద్ద రామ్ చరణ్

ఇప్పుడు నటుడు రామ్ చరణ్ కూడా తన కవలలను, అతని భార్య ఉపాసనను చూడటానికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ హాస్పిటల్ లోపలకు ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఫ్యాన్స్ నుండి తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన శుభవార్త తెలుసుకున్న తర్వాత ఉదయం ఆసుపత్రి వెలుపల పెద్ద సంఖ్యలో మెగా ఫ్యాన్స్ గుమిగూడారు.

అయితే అదే సమయంలో చరణ్ తన రెండేళ్ల కూతురు క్లిన్‌కారాతో ఆసుపత్రికి వచ్చాడు. అభిమానులు ఆయన వాహనం వైపు దూసుకువచ్చి చుట్టుముట్టారు. చరణ్ లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వమని వారిని కోరగా, అభిమానులు ఆ ప్రదేశంలో గుమిగూడి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో చేసినట్టుగా కనిపిస్తుంది. గందరగోళంలో చరణ్ తన సహనాన్ని కోల్పోయేపరిస్థితి వచ్చింది. చేతిలో చిన్నపాప ఉందనే విషయాన్ని కూడా ఫ్యాన్స్ మరిచిపోయారు.

ఆసుపత్రి నుండి వచ్చిన షాకింగ్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో హద్దులేని అభిమనం ఆందోళనలు రేకెత్తిస్తోంది. చరణ్‌తో పాటు చిన్న అమ్మాయి ఉన్నప్పటికీ అభిమానులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆసుపత్రి వెలుపల భయాందోళన వాతావరణాన్ని సృష్టించారు.

'మాకు బేబీ బాయ్, గర్ల్ వచ్చారని చెప్పేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకును కలిగి ఉండటం మమ్మల్ని కృత‌జ్ఞతాభావంతో నింపేస్తుంది. మన జీవితంలోని మహిళలే మన గొప్ప బలం. ప్రతి క్షణంలోనూ మాకు అండగా నిలిచి సపోర్ట్ చేసిన మా అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు.' అని సోషల్ మీడియాలో రామ్ చరణ్ పోస్టు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe