...
...
Next Story

Peddi Dragon: పెద్దితో అదరగొడుతున్న రామరాజు.. ఇక భీమ్ దండయాత్రకు రంగం సిద్ధం.. ఇవాళ రాత్రి ఎన్టీఆర్ నీల్ మూవీ గ్లింప్స్

Peddi Dragon: ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజుగా రామ్ చరణ్, భీమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టారు. ఇప్పుడు సెపరేట్ గా తమ మూవీస్ తో సత్తాచాటుతున్నారు. పెద్ది ట్రైలర్ తో చరణ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు. ఇక జోష్ ను మరింత పెంచేందుకు గ్లింప్స్ తో ఎన్టీఆర్ రాబోతున్నాడు.

Published on: May 19, 2026, 13:43:48 IST
Advertisement

Peddi Dragon: టాలీవుడ్ హీరోల్లో రామ్ చరణ్, జూనియ్ ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉంది. పర్సనల్ లైఫ్ లోనూ వీళ్లు చాలా క్లోజ్. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఆర్ఆర్ఆర్ లో అదరగొట్టారు. ఇప్పుడు సెపరేట్ గా తమ సినిమాలతో సత్తాచాటుతున్నారు. పెద్దితో రామ్ చరణ్, డ్రాగన్ తో ఎన్టీఆర్ రికార్డుల వేటకు సై అంటున్నారు.

పెద్దితో రామరాజు

ఆర్ఆర్ఆర్ మూవీలోని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టిల్
ఆర్ఆర్ఆర్ మూవీలోని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టిల్

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజుగా నటించాడు రామ్ చరణ్. ఈ గ్లోబల్ స్టార్ ఇప్పుడు పెద్ది మూవీతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు. సోమవారం (మే 18) సాయంత్రం రిలీజైన పెద్ది ట్రైలర్ తెగ వైరల్ గా మారింది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ఈ ట్రైలర్ దూసుకెళ్తోంది. రామ్ చరణ్ గ్రామీణ క్రీడాకారుడిగా కనిపించనున్న ఈ మూవీకి బుచ్చిబాబు సాన డైరెక్టర్.

డ్రాగన్ తో భీమ్

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ లో ప్రధాన పాత్ర పోషించాడు. భీమ్ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు డ్రాగన్ తో సోషల్ మీడియాను షేక్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ చేస్తున్న మూవీకి ‘డ్రాగన్’ టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ఈ రోజు రాత్రి ఈ చిత్రం టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.

గ్లింప్స్ టైమ్

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ గ్లింప్స్ ను మంగళవారం రాత్రి 11.52 గంటలకు రిలీజ్ చేయనున్నారు. దీన్ని అయిదు భాషల్లో ఆడియన్స్ కోసం విడుదల చేస్తున్నారు. రేపు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు ముందుగానే బర్త్ డే ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కు గ్లోబల్ లెవల్లో గుర్తింపు దక్కింది. కానీ ఈ హీరోల చివరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. గేమ్ ఛేంజర్ తో చరణ్, వార్ 2తో ఎన్టీఆర్ ఫ్లాప్ లు మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్దితో రామ్ చరణ్, డ్రాగన్ తో తారక్ గ్రాండ్ గా కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాలపై భారీ హైప్ నెలకొంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks