ఫ్యాన్స్ కు రామ్ చరణ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. శనివారం (నవంబర్ 8) రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీలో పాల్గొన్నాడు. జాన్వీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి వచ్చాడు. రెహమాన్ క్లాసిక్ పాటలను వినడానికి వచ్చిన అభిమానులు.. రామ్, జాన్వీ వేదికపైకి రావడంతో ఆశ్చర్యపోయారు.
చిన్నప్పటి కల

ఏఆర్ రెహమాన్ కచేరీలో రామ్ చరణ్ వేదికపైకి వచ్చి ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాడు. “చికిరి పాట అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతంలో భాగం కావడం నా చిన్ననాటి కల. అది కూడా నాకు ఇష్టమైన 'పెద్ది' సినిమాతో కావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదని నేను భావిస్తున్నా” అని రామ్ చరణ్ అన్నాడు. ఆ మాటలకు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
జాన్వీ తెలుగులో
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో స్పీచ్ తో అదరగొట్టింది.“ఈ సినిమాలో భాగం అయ్యే అవకాశం దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తున్నా. మా ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ సినిమాలో మీకు ఒక డిఫరెంట్, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం” అని తెలుగులో మాట్లాడింది జాన్వీ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
{{/usCountry}}బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో స్పీచ్ తో అదరగొట్టింది.“ఈ సినిమాలో భాగం అయ్యే అవకాశం దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తున్నా. మా ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ సినిమాలో మీకు ఒక డిఫరెంట్, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం” అని తెలుగులో మాట్లాడింది జాన్వీ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
{{/usCountry}}రెహమాన్ కూడా తెలుగు భాషపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. 'పెద్ది' చిత్రానికి పనిచేయడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ కచేరీకి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ తెలుగులో మాట్లాడటం చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
పెద్ది గురించి..
'పెద్ది' ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రామ్, జాన్వీ, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. సినిమా ప్రోమోలను బట్టి చూస్తే ఇది ఒక గ్రామీణ క్రికెటర్ కథ అని తెలుస్తోంది. 2010లో వచ్చిన 'కొమరం పులి', 2016లో వచ్చిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాల తర్వాత రెహమాన్ మళ్లీ తెలుగులో పెద్ది కోసమే పనిచేస్తున్నారు. 'పెద్ది' చిత్రం మార్చి 27, 2026న థియేటర్లలో విడుదల కానుంది.