...
...
Next Story

Klin Kaara Face: క్లిన్ కారా ఫేస్ రివీల్.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఫొటో.. అచ్చం అమ్మలాగే.. సమంత కామెంట్ చూశారా?

Klin Kaara Face: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేనిల ముద్దుల కుమార్తె క్లిన్ కారా కొణిదెల ఫేస్ రివీలైంది. ఇన్ని రోజులూ ప్రైవసీ పాటిస్తూ వచ్చిన మెగా ఫ్యామిలీ.. ఈ చిన్నారి మూడో పుట్టిన రోజున మెగా ట్రీట్ ఇచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సమంత రియాక్టయింది.

Published on: Jun 20, 2026, 17:57:31 IST
Advertisement

Klin Kaara Face: మెగా అభిమానులు గత మూడేళ్లుగా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ అపురూప క్షణం రానే వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లిన్ కారా కొణిదెల (Klin Kaara) ముఖాన్ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. క్లిన్ కారా మూడో బర్త్ డే సందర్భంగా ఇవాళ (జూన్ 20) బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

క్లిన్ కారా ఫేస్

క్లిన్ కారా ఫేస్ రివీల్.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఫొటో (instagram)
క్లిన్ కారా ఫేస్ రివీల్.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఫొటో (instagram)

మొదటి నుంచి కుమార్తె క్లిన్ కారా వ్యక్తిగత జీవితానికి, ప్రైవసీకి రామ్ చరణ్- ఉపాసన అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. కనీసం పాప ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. జూన్ 20న క్లిన్ కారా మూడో పుట్టినరోజును పురస్కరించుకుని మెగా ప్రిన్సెస్ క్యూట్ లుక్‌ను ఇప్పుడు అఫీషియల్‌గా రివీల్ చేశారు.

అచ్చం అమ్మలాగే

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈ ఫోటో చూసి ఎమోషనల్ అవుతూ హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను చాటుకుంది. రామ్ చరణ్ చెల్లెలు నిహారిక కొణిదెల, పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల, లక్ష్మీ మంచు, పీవీ సింధు తదితర సెలబ్రిటీలు కూడా కామెంట్లు పెట్టారు.

స్కూల్ డేస్ లవ్.. ఇప్పుడు ముగ్గురు పిల్లలు

రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ పాఠశాల రోజుల్లో క్లాస్‌మేట్స్ అనే విషయం తెలిసిందే. జూన్ 2012లో వివాహం చేసుకున్న ఈ జంట.. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత 2023లో క్లిన్ కారాకు జన్మనిచ్చారు. అయితే, మెగా ఫ్యామిలీలో అసలైన డబుల్ ధమాకా ఈ ఏడాది ప్రారంభంలోనే జరిగింది. జనవరి 31, 2026 న ఉపాసనకు కవల పిల్లలకు (ట్విన్స్) జన్మించారు. ఆ కవలలకు శివరామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు.

ఇటు పర్సనల్ లైఫ్‌లో ముగ్గురు పిల్లలతో హ్యాపీగా ఉన్న చరణ్.. ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' (Peddi) చిత్రంతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లు కొల్లగొట్టి కెరీర్ పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe