ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి కాంట్రవర్సీకి తెరతీశాడు. కాంటెంపరరీ ఇష్యూస్ పై తన స్టైల్లో రియాక్ట్ అయ్యే ఆర్జీవీ లేటెస్ట్ గా అమెరికా-ఇరాన్ యుద్ధంపై ట్వీట్ పెట్టాడు. ఈ కాంట్రవర్సీ ట్వీట్ తెగ వైరల్ గా మారింది. మతాల పేరుతో ఆర్జీటీ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.
యుద్ధంపై ఆందోళన

ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై యుద్ధం చేస్తున్నాయి. మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్నాయి. బదులుగా ఇరాన్ కూడా డ్రోన్లు, మిస్సైల్స్ తో మిడిల్ ఈస్ట్ లోని అమెరికా ఎంబసీలపై దాడులు చేస్తున్నాయి. ప్రపంచమంతా ఈ యుద్ధం గురించి ఆందోళన చెందుతోంది.
ఆర్జీవీ ట్వీట్
అమెరికా-ఇరాన్ యుద్ధంపై తాజాగా ఆర్జీవీ పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ‘‘అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జీసస్, అల్లా మధ్య ఫైట్ లాంటిదే. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారతా’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
అందుకే ఆ ట్వీట్
అమెరికాలో మెజారిటీ జనాలు క్రిస్టియన్లే. వీళ్లు జీసస్ ను ఆరాధిస్తారు. యేసు ప్రభువును నమ్ముతారు. మరోవైపు ఇరాన్ ఏమో ముస్లిం కంట్రీ. ఇక్కడ అందరూ అల్లాను ప్రార్థిస్తారు. అందుకే అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని జీసస్, అల్లా మధ్య ఫైట్ గా పేర్కొంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
డోనాల్డ్ ట్రంప్ రైట్
{{/usCountry}}అమెరికాలో మెజారిటీ జనాలు క్రిస్టియన్లే. వీళ్లు జీసస్ ను ఆరాధిస్తారు. యేసు ప్రభువును నమ్ముతారు. మరోవైపు ఇరాన్ ఏమో ముస్లిం కంట్రీ. ఇక్కడ అందరూ అల్లాను ప్రార్థిస్తారు. అందుకే అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని జీసస్, అల్లా మధ్య ఫైట్ గా పేర్కొంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
డోనాల్డ్ ట్రంప్ రైట్
{{/usCountry}}‘‘బలవంతుడు ఏం చేసినా రైట్. ‘ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో వాళ్లు తప్పు చేసినా కరెక్టే అవుతుంది’ అని సర్కార్ సినిమాలో సెల్వర్ మణి డైలాగ్ ఉంది. అందుకే ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ రైట్. అతని దగ్గర బలముంది’’ అని ఆర్జీవీ అంతకుముందు మరో ట్వీట్ చేశాడు.
అమెరికా-ఇరాన్ వార్
ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై చేస్తున్న వార్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. బాంబుల మోత మోగుతోంది. మిస్సైల్స్ వర్షం కురుస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా హతం చేసిన సంగతి తెలిసిందే. ప్రతీకారం కోసం రగిలిపోతున్న ఇరాన్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో విధ్వంసకాండ రచిస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా దుబాయ్, అబుదాబి, ఒమన్, ఖతార్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా దేశాలకు ఇతర దేశాల నుంచి ఫ్లైట్ సర్వీస్ లు రద్దయ్యాయి. దీంతో దుబాయ్ లో చాలా మంది ఇండియన్స్ చిక్కుకుపోయారు.