తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. 2025 బాక్సాఫీస్ విజేతగా నిలిచిన ‘ధురంధర్’ చిత్రంపై మొదటి నుంచి ప్రశంసలు కురిపిస్తున్న ఆర్జీవీ ఇప్పుడు సీక్వెల్ ‘ధురంధర్ 2’కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ వదిలారు.
“ధురంధర్ దెబ్బ ‘టాక్సిక్’గా ఉంటుంది!”

అయితే, ఈ ట్వీట్‌లో ‘రాకింగ్ స్టార్’ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేసినట్లుగా కనిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది.
"ధురంధర్ 2 కాటు ‘టాక్సిక్’గా (విషపూరితంగా) ఉండబోతోంది" అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు. అంటే, దురంధర్ 2 దెబ్బకు టాక్సిక్ తలవంచక తప్పదు అన్న అర్థంలో పరోక్షంగా యశ్ సినిమాపై సెటైర్లు వేశారు ఆర్జీవీ.
2026 మార్చి 19న ఈ రెండు భారీ చిత్రాలు దురంధర్ 2, టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ ఈ ట్వీట్ చేశాడని అంతా భావిస్తున్నారు. అంతేకాకుండా టాక్సిక్‌పై సెటైర్ల కారణంగా రామ్ గోపాల్ వర్మపై యశ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాది చిత్రాలపై ఆర్జీవీ సెటైర్లు
బాలీవుడ్‌లోకి సౌత్ సినిమాల దండయాత్రను ‘ధురంధర్’ సినిమా అడ్డుకుందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. "బాలీవుడ్‌లోకి చొచ్చుకొస్తున్న సౌత్ సినిమాల ‘ఫైర్ బాల్’ను దర్శకుడు ఆదిత్య ధర్ తన ఎడమ కాలు (ధురంధర్)తో తన్నేశారు. ఇప్పుడు ఆయన తన కుడి కాలు (ధురంధర్ 2) సిద్ధం చేస్తున్నారు. మొదటి భాగం భయపెట్టి ఉంటే, రెండో భాగం వణికించబోతోంది" అంటూ ఆర్జీవీ ఇదివరకు రాసుకొచ్చారు.
రికార్డుల వేటలో ‘ధురంధర్’
ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ 2025లో అతిపెద్ద హిట్గా నిలిచింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్గా దురంధర్ 2 మార్చి 19న రానున్న విషయం తెలిసిందే.
సవాల్ విసురుతున్న ‘టాక్సిక్’
{{/usCountry}}ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ 2025లో అతిపెద్ద హిట్గా నిలిచింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్గా దురంధర్ 2 మార్చి 19న రానున్న విషయం తెలిసిందే.
సవాల్ విసురుతున్న ‘టాక్సిక్’
{{/usCountry}}మరోవైపు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కూడా అదే రోజున (మార్చి 19) విడుదల కానుంది. ఉగాది, ఈద్ పండుగల సెలవులను దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ రిలీజ్ చేస్తున్నారు.
టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఇటీవల నయనతార లుక్ కూడా విడుదల కావడంతో టాక్సిక్ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.