...
...
Next Story

శివాజీ మొరగడం గురించి ఈ ముగ్గురు హీరోయిన్లు పట్టించుకోలేదు-హ్యాట్సాఫ్-రాజా సాబ్ భామలపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

నటీమణుల దుస్తులపై శివాజీ చేసిన అసభ్య వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ మరోసారి తీవ్రంగా స్పందించాడు. తమకు నచ్చిన దుస్తులు వేసుకున్న రాజా సాబ్ హీరోయిన్లకు ఆయన హ్యాట్సాఫ్ అని చెప్పాడు.

Published on: Dec 29, 2025, 10:42:24 IST
Advertisement

‘దండోరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్ లపై నటుడు శివాజీ చేసిన మిస్సోజినిస్టిక్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీని ‘అనాగరికుడు’ అని పిలిచిన కొద్ది రోజులకే, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయనపై మరోసారి తన విమర్శల దాడిని కొనసాగించారు.

రాజా సాబ్ హీరోయిన్లు

ప్రభాస్ తో రాజా సాబ్ హీరోయిన్లు
ప్రభాస్ తో రాజా సాబ్ హీరోయిన్లు

ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు ఈ మూవీ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తమకు నచ్చిన దుస్తులు వేసుకుని వచ్చారు. ఈ హీరోయిన్లు తమ కంఫర్ట్ ఉన్న బట్టలోనే రావడాన్ని పేర్కొంటూ ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ నైతికంగా మొరగడం గురించి ఎవరూ ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నాడు రామ్ గోపాల్ వర్మ.

మొరగడాన్ని పట్టించుకోకుండా

‘‘ఆ విలన్లకు గట్టిగా సమాధానం చెప్పిన ఈ ముగ్గురు హీరోలకు హాట్సాఫ్’’ అని రామ్ గోపాల్ వర్మ తన పోస్టును ముగించాడు. రాజా సాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం రిద్ది కుమార్ మెరిసే నల్లటి లెహంగాను ఎంచుకోగా, మాళవిక అందమైన తెలుపు చీరలో కనిపించింది. ఇక నిధి బూడిద రంగు చీరలో దర్శనమిచ్చింది.

శివాజీ ఏమన్నాడు?

మహిళలు పద్ధతిగా దుస్తులు ధరించకపోతే వారిని ‘దరిద్రపు ము***’ అని, వారి శరీర భాగాలను ‘సామాను’ అని అసంబద్ధమైన పదజాలంతో సంబోధించారని శివాజీ వివాదాన్ని రేకెత్తించాడు. అలా దుస్తులు ధరించకపోతే వారిని ‘దరిద్రపు స్త్రీ’గా పరిగణిస్తారని కూడా ఆయన అన్నాడు. ఈ విమర్శల తర్వాత, తాను అనుకోకుండా రెండు 'అసంబద్ధమైన' పదాలను ఉపయోగించానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని ఆయన ఎక్స్ ఖాతాలో అంగీకరించాడు.

ఆర్జీవీ విమర్శలు

కొద్ది రోజుల క్రితం ఆర్జీవీ శివాజీని విమర్శిస్తూ ఇలా రాశాడు. ‘ఆ వ్యక్తి పూర్తి పేరు నాకు తెలియదు. అందుకనే ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నా. హే శివాజీ, నువ్వేమైతేనేమి, నీ ఇంట్లోని స్త్రీలు నీలాంటి అనాగరిక, అసహ్యకరమైన వ్యక్తిని సహించడానికి సిద్ధంగా ఉంటే, వారిపై నీతిబోధ చేసుకో. సమాజంలోని లేదా సినీ పరిశ్రమలోని ఇతర స్త్రీల విషయంలో, నీ అభిప్రాయాలను నీ దగ్గరే పెట్టుకో’’ అని ఆర్జీవీ ఫైర్ అయ్యాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks