RGV Chuttamalle Song: 'దేవర' చిత్రంలోని 'చుట్టమల్లే' పాటను ఆధారంగా చేసుకుని నటి జాన్వీ కపూర్ ఏఐ డీప్‌ఫేక్ వీడియోను సృష్టించిన వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (RGV) చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట సరికొత్త దుమారాన్ని రేపుతోంది.
ఆర్జీవీ ట్వీట్

జాన్వీ కపూర్ ఏఐ వీడియో వివాదంపై రామ్‌గోపాల్ వర్మ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయంలో సెలబ్రిటీలందరూ సాధించింది ఒక్కటేనని, అది ఆ నీచమైన వీడియో లింక్‌కు విపరీతమైన ప్రచారం కల్పించి, కోట్లాది మంది ఆ వీడియోను చూసేలా చేయడమేనని ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సెలబ్రిటీలది కూడా నేరమే
‘‘సెలబ్రిటీలందరూ సాధించిన ఒకే ఒక్క విజయం ఏంటంటే, ఆ వివాదాస్పద లింక్‌ను బాగా ప్రచారం చేసి, దానివల్ల కోట్ల మంది ప్రజలు చూసేలా చేయడం. నేరస్థుడిని పట్టుకోవడంపై దృష్టి పెట్టి, ఆ విషయాన్ని ప్రచారం చేసి ఉంటే తెలివైన పని అయ్యేది. కానీ దానికి బదులుగా, వారు ట్వీట్లు చేసి బాధితురాలి గుర్తింపుపై, ఆ అసభ్యకరమైన కంటెంట్‌పై అందరి దృష్టి పడేలా చేశారు. ఇది కూడా ఒక నేరమే’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
అసహ్యకరమైన ఆ వీడియోను ఖండిస్తూ సెలబ్రిటీలు చేసిన ట్వీట్ల వల్ల బాధితురాలి గుర్తింపుతో పాటు ఆ వివాదాస్పద కంటెంట్ వైపు అందరి దృష్టి మళ్లిందని వర్మ పేర్కొన్నారు. సమాజంలో ఇటువంటి వీడియోలకు విపరీతమైన పబ్లిసిటీ తేవడం కూడా ఒక రకంగా ఆ కంటెంట్‌ను వ్యాప్తి చేయడమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
నెట్టింట కొత్త చర్చ
అంతకుముందు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ డీప్‌ఫేక్ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. చుట్టమల్లే సాంగ్ ఏఐ డీప్ ఫేక్ వీడియోపై తారక్ ఫైర్ అయ్యారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఏఐని దుర్వినియోగం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తేవాలని ఎన్టీఆర్ కోరారు.
{{/usCountry}}అంతకుముందు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ డీప్‌ఫేక్ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. చుట్టమల్లే సాంగ్ ఏఐ డీప్ ఫేక్ వీడియోపై తారక్ ఫైర్ అయ్యారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఏఐని దుర్వినియోగం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తేవాలని ఎన్టీఆర్ కోరారు.
{{/usCountry}}అయితే, ఎన్టీఆర్ నేరస్థులకు గట్టి హెచ్చరిక జారీ చేయడం సరైనదే అని కొందరు సమర్థిస్తుండగా, ఆర్‌జీవీ చెప్పినట్లు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆ ఏఐ వీడియోను సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిందని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా హీరోయిన్ ను ఇలా న్యూడ్ గా మార్ఫింగ్ చేయడాన్ని మాత్రం ఉపేక్షించేది లేదని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.