Ramani Kalyanam Movie Trailer Released: ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ సమయంలో తెలుగు తెరపైకి రానున్న ఫీల్‌గుడ్ ఎమోషనల్ మూవీ రమణి కళ్యాణం.
రమణి కళ్యాణం ట్రైలర్ రిలీజ్

ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రమణి కళ్యాణం సినిమా. తాజాగా రమణి కళ్యాణం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పుడు ఆ ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది ఈ రమణి కళ్యాణం సినిమా.
“కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది” అనే డైలాగ్‌తో మొదలయ్యే రమణి కళ్యాణం ట్రైలర్ మొదటి క్షణం నుంచే కథలోకి తీసుకెళ్లింది. స్టోరీ ఆఫ్ ద సారీ అనే టైటిల్‌తో ఆర్జే సంజన స్టార్ట్ చేసే పోగ్రామ్ ఆకట్టుకునేలా ఉంది. ఒక కథలో ఎవరు ఎవరికి సారీ చెప్పాలనే అంశంతో ఈ పోగ్రామ్ నడుస్తుంటుంది.
బ్లైండ్ అనేది క్వాలిఫికేషన్ కాదు
కంచన్ ఈ పిల్ల ఆర్జే అయితే, రోజు డీజేనే. ఎవర్రా ఈ పిల్లా అని మరో క్యారెక్టర్‌ను కిర్రాక్ సీత అడిగే సీన్‌తో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఆసక్తిగా ఉంటుంది. అప్పుడు సంజన ఆర్జే & సింగర్. తను బ్లైండ్ అని ఒకతను పరిచయం చేస్తాడు. బ్లైండ్ అనేది నా క్వాలిఫికేషన్ కాదు అని హీరోయిన్ చెప్పే డైలాగ్ తన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. ఆమె నలుగురు పిల్లలను పోషిస్తుంటుంది.
తనను పెళ్లి చేసుకున్నవాళ్లకు కట్నంతోపాటు ఈ నలుగురు పిల్లలను కూడా ఇస్తానని సంజన తన బామ్మతో చెబుతూ ఉంటుంది. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు హీరో రాజ్. వీళ్లిద్దరు ఆర్జే పోగ్రామ్‌లో కలుసుకుంటారు. ఆ తర్వాత ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ కథని చాలా ఎంటర్టైనింగ్ అలాగే ఎమోషనల్‌గా చెప్పారు డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి.
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ
{{/usCountry}}తనను పెళ్లి చేసుకున్నవాళ్లకు కట్నంతోపాటు ఈ నలుగురు పిల్లలను కూడా ఇస్తానని సంజన తన బామ్మతో చెబుతూ ఉంటుంది. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు హీరో రాజ్. వీళ్లిద్దరు ఆర్జే పోగ్రామ్‌లో కలుసుకుంటారు. ఆ తర్వాత ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ కథని చాలా ఎంటర్టైనింగ్ అలాగే ఎమోషనల్‌గా చెప్పారు డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి.
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ
{{/usCountry}}ఈ కథని నేచురల్‌గా చూపించిన తీరు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఎక్కడా బలవంతపు డ్రామా లేకుండా, చిన్న చిన్న ఎమోషనల్ మూమెంట్స్‌తో కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. కాళ్లు లేనివాడిగా సూర్య వశిష్ట, కళ్లు లేని సంజనగా దీప్షిక చంద్రన్ కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ట్రైలర్‌కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి.
ముఖ్యంగా సైలెంట్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. కోర్ట్ ఫేం రామ్ జగదీష్ రాసిన డైలాగ్స్ ట్రైలర్‌కు మరో బలం. కొన్ని మాటలు నేరుగా హార్ట్‌ను టచ్ చేసేలా ఉన్నాయి. టెక్నికల్‌గా కూడా ట్రైలర్ మంచి ఇంప్రెషన్ ఇచ్చింది. సాఫ్ట్ విజువల్స్‌తో కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది.
మే 22న రిలీజ్
మొత్తం మీద రమణి కళ్యాణం ట్రైలర్ అంతా ఒక క్లీన్ ఫీల్‌గుడ్ మూవీగా తలపించింది. కాగా, విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రమణి కళ్యాణం సినిమాను కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మే 22న థియేటర్లలో గ్రాండ్‌గా రమణి కళ్యాణం మూవీ విడుదల కానుంది.
ఈ క్రమంలో విడుదలైన రమణి కళ్యాణం సినిమా ట్రైలర్, హీరో హీరోయిన్ల మధ్య ఆకట్టుకునే కెమిస్ట్రీతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని పెంచుతోంది.