...
...
Next Story

Ramayana Collection: పనిచేసిన ఎత్తుగడ- ఇండియాలోనే 1000 కోట్ల కలెక్షన్స్- రామాయణం 23 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇలా!

Ramayana Box Office Collection Day 23: రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ తెరకెక్కించిన రామాయణం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. నవంబర్ 5న విడుదలైన ఈ భారీ పౌరాణిక చిత్రం భారత్‌లో ఏకంగా రూ.1000.55 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి అరుదైన మైలురాయిని అందుకుంది.

Published on: Nov 28, 2026, 13:17:49 IST
Advertisement

Ramayana 23 Days Worldwide Collection: భారతీయ సినీ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నీతేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన దృశ్యకావ్యం 'రామాయణ' దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల మార్కును దాటేసింది.

వెయ్యి కోట్ల కలెక్షన్స్

పనిచేసిన ఎత్తుగడ- ఇండియాలోనే 1000 కోట్ల కలెక్షన్స్- రామాయణం 23 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇలా!
పనిచేసిన ఎత్తుగడ- ఇండియాలోనే 1000 కోట్ల కలెక్షన్స్- రామాయణం 23 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇలా!

నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజు నుంచే విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను అందుకుంటోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన రామాయణం సినిమా ఇప్పుడు దేశంలోనే వెయ్యి కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది.

తొలిరోజు నుంచే రికార్డుల వేట

2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో 'రామాయణ' అగ్రస్థానంలో నిలిచింది. విడుదలకు 15 రోజుల ముందే దసరా సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ తెరవగా.. థియేటర్లలోకి రాకముందే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి.

తొలిరోజు భారత్‌లో రూ.64.85 కోట్లు రాబట్టి, బాలీవుడ్ చరిత్రలో నాలుగో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత సోమవారం రూ.107 కోట్ల నికర వసూళ్లు, మంగళవారం రూ.94 కోట్ల నికర వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వీక్‌డే కలెక్షన్ల రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

విశేష ఆదరణ లభించడంతో

తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పౌరాణిక గాథకు విశేష ఆదరణ లభించడంతో వసూళ్లు స్థిరంగా కొనసాగాయి. అయితే మూడో వారంలో కలెక్షన్లలో కొంత నెమ్మది కనిపించడంతో చిత్ర బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకున్న నాలుగో భారతీయ సినిమాగా 'రామాయణ' నిలిచింది. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో తెలుగు చిత్రాలు 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్', 'పుష్ప 2: ది రూల్' ఉండగా, ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'ధురంధర్ 2: ది రివెంజ్' మూడో స్థానంలో నిలిచింది.

ఇప్పుడు 'ధురంధర్ 2' తర్వాత ఈ అరుదైన ఫీట్ సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. ఇక 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రామాయణం సినిమాకు రూ. 1790.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 595 కోట్లు రాబట్టింది.

భారీ తారాగణం.. రెండో భాగం ఎప్పుడంటే?

వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యం 'రామాయణం' ఆధారంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఒదిగిపోగా, సీతాదేవిగా సాయి పల్లవి తన నటనతో మెప్పించారు. ప్రతినాయకుడు రావణాసురుడిగా యశ్ గంభీరమైన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ కీలక పాత్రల్లో మెరిశారు.

నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఆస్కార్ విజేత సంస్థ డీనెగ్ (DNEG), యశ్ సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును రెండు భాగాలుగా నిర్మిస్తున్నాయి. తొలి భాగం నవంబర్ 5, 2026న విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండగా, రెండో భాగాన్ని 2028 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks