...
...
Next Story

Rana Ameer Log: ముగ్గురు గల్లీ దోస్తుల కథ- అమీర్ లోగ్ రైట్స్ కొనేసిన రానా దగ్గుబాటి- రెండు రాష్ట్రాల్లో భారీ రిలీజ్!

Rana Daggubati Buys Ameer Log Theatrical Rights: హైదరాబాద్ గల్లీ కుర్రాళ్ల కథతో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అమీర్ లోగ్'. ఈ చిత్ర కంటెంట్‌ నచ్చడంతో టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటికి చెందిన 'స్పిరిట్ మీడియా' రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.

Published on: Jul 2, 2026, 09:03:22 IST
Advertisement

Rana Daggubati Buys Ameer Log Theatrical Rights: తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన కంటెంట్‌ను, చిన్న చిత్రాలను ప్రోత్సహించడంలో హీరో, నిర్మాత రానా దగ్గుబాటి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

అమీర్ లోగ్ థియేట్రికల్ రైట్స్

ముగ్గురు గల్లీ దోస్తుల కథ- అమీర్ లోగ్ రైట్స్ కొనేసిన రానా దగ్గుబాటి- రెండు రాష్ట్రాల్లో భారీ రిలీజ్!
ముగ్గురు గల్లీ దోస్తుల కథ- అమీర్ లోగ్ రైట్స్ కొనేసిన రానా దగ్గుబాటి- రెండు రాష్ట్రాల్లో భారీ రిలీజ్!

సరికొత్త కాన్సెప్ట్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘అమీర్ లోగ్’ సినిమా థియేట్రికల్ హక్కులను రానాకు చెందిన ‘స్పిరిట్ మీడియా’ కైవసం చేసుకుంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు పెద్ద బ్యానర్ తోడైతే థియేటర్లలో వాటి రేంజ్ ఎలా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు స్పిరిట్ మీడియా అండ దొరకడంతో టాలీవుడ్ వర్గాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

ముగ్గురు గల్లీ దోస్తుల కథ

హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన ముగ్గురు స్నేహితుల చుట్టూ అమీర్ లోగ్ సినిమా కథ తిరుగుతుంది. వారి జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న పరిస్థితులు, కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్లాన్

వినోదంతో పాటు నేటి యువతకు అవసరమైన ఒక మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రంలో చూపించారట. అమీర్ లోగ్ సినిమా అవుట్‌పుట్ చూసి బాగా నచ్చడంతోనే స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

దర్శకత్వం- హీరోలు

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ ఈ చిత్రాన్ని నిర్మించగా, రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా.. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే క్రేజ్ తెచ్చుకున్న ప్రమోషన్స్

పక్కా కమర్షియల్ కామెడీ ఎలిమెంట్స్‌తో వస్తున్న అమీర్ లోగ్ సినిమా ఓటీటీ, థియేట్రికల్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందించగా, ఎస్‌వీకే (SVK) ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు.

త్వరలోనే గ్రాండ్ రిలీజ్

అలాగే, అమీర్ లోగ్ సినిమాకు రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మనోహర్ రెడ్డి మంచూరి సహ నిర్మాతగా, సందీప్ బొరెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. స్పిరిట్ మీడియా రంగంలోకి దిగడంతో త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe