...
...
Next Story

Ranbir Kapoor: రాముడు కేవలం పాత్ర కాదు.. అది నా అదృష్టం.. రణ్‌బీర్ కామెంట్లు వైరల్.. అక్కడ రామాయణ గ్లింప్స్ స్క్రీనింగ్

Ranbir Kapoor: మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల్లో ‘రామాయణ’ ఒకటి. శ్రీ రాముడి జీవిత కథతో రాబోతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తున్నాడు. లాస్ ఏంజెల్స్‌లో ఈ మూవీ స్పెషల్ గ్లింప్స్ ప్లే చేశారు. ఈ సందర్భంగా రాముడి పాత్ర గురించి రణ్‌బీర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: Mar 31, 2026, 12:40:58 IST
Advertisement

దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణ' ఇప్పుడు గ్లోబల్ టాపిక్ అయింది. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లోని ఐమ్యాక్స్ లో ఈ మూవీ గ్లింప్స్ ను ప్రదర్శించారు. డైరెక్టర్ నితీష్, హీరో రణ్‌బీర్ కపూర్, నిర్మాత నమిత్ మల్హోత్రా కలిసి అంతర్జాతీయ ప్రేక్షకులకు సినిమా విజువల్స్‌ను పరిచయం చేశారు.

రణ్‌బీర్ కామెంట్లు

Nitesh Tiwari's Ramayana is slated to release later this year. (Photo: Yogen Shah)
Nitesh Tiwari's Ramayana is slated to release later this year. (Photo: Yogen Shah)

‘రామాయణ’ గ్లింప్స్ స్క్రీనింగ్ ఈవెంట్లో హీరో రణ్‌బీర్ కపూర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. రాముడి పాత్ర గురించి తన మనసులోని మాటను అతను పంచుకున్నాడు. రాముడు కేవలం పాత్ర కాదు, కోట్లాది మందికి ఒక 'ఆత్మసాక్షి' అని రణ్‌బీర్ అభివర్ణించాడు.

ఆ పాత్రను పోషించడం

కరుణ, ధైర్యం, ధర్మాలకు ప్రతీక అయిన మర్యాద పురుషోత్తముడి పాత్రను పోషించడం తనకు దక్కిన గౌరవమని రణ్‌బీర్ కపూర్ అన్నాడు. రామాయణ సినిమాలో రాముడిగా కనిపించడం తన అదృష్టం అని రణ్‌బీర్ కపూర్ చెప్పాడు.

ఏప్రిల్ 2న గ్లింప్స్

రామాయణ గ్లింప్స్ ను ఏప్రిల్ 2 రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే లాస్ ఏంజెలెస్ లోని ఐమ్యాక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ గ్లింప్స్ లెంగ్త్ 2 నిమిషాల 38 సెకన్లు ఉందని తెలిసింది. సినిమాలోని ప్రధాన పాత్రలను ఈ గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారని టాక్.

యష్ వర్సెస్ రణ్‌బీర్

అదే సమయంలో రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ అగ్నిపర్వతంలాంటి లుక్‌లో మెప్పించాడు. ఈ గ్లింప్స్‌లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా చూపించి సినిమా లార్జర్ దేన్ లైఫ్ ఉండబోతుందని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు.

సీతగా సాయి పల్లవి

ఈ భారీ చిత్రంలో సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతోంది.

విడుదల తేదీ అప్‌డేట్

ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం అక్టోబర్ 2026లో దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రానుంది. ఇక రెండవ భాగం 2027లో విడుదలవుతుంది. ప్రస్తుతం రణ్‌బీర్ రాముడి గెటప్ లో చెట్టు ఎక్కడం, విల్లు ధరించడం వంటి విజువల్స్ అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks