...
...
Next Story

OTT Today Telugu: ఓటీటీలోకి ఇవాళ సీనియర్ నటుడు సురేష్ ఎంట్రీ- రంగస్థలంపై హీరో, సినిమాల్లో జీరో- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Suresh Rangasthalam OTT Release Today: 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో సాగే హృద్యమైన కథ రంగస్థలం ఓటీటీలోకి నేడు వచ్చేసింది. సీనియర్ నటుడు సురేష్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా నాటకరంగ కళాకారుడ చేసే పోరాటం చుట్టూ సాగుతుంది. మరి రంగస్థలం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 22, 2026, 12:13:28 IST
Advertisement

Suresh Rangasthalam OTT Streaming Today: తెలుగు నేల మీద నాటక రంగానికి ఒకప్పుడు వెలుగువెలిగిన చరిత్ర ఉంది. పల్లెల్లో తిరునాళ్లు, జాతరలు జరిగితే రాత్రంతా పౌరాణిక, సాంఘిక నాటకాలతో ఊరంతా సందడిగా ఉండేది. కానీ 1980ల దశకంలో టూరింగ్ టాకీసులు, సినిమా థియేటర్ల రాకతో ఆ వైభవం క్రమంగా మసకబారడం మొదలైంది.

ఓటీటీలోకి రంగస్థలం

ఓటీటీలోకి ఇవాళ సీనియర్ నటుడు సురేష్ ఎంట్రీ- రంగస్థలంపై హీరో, సినిమాల్లో జీరో- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ సీనియర్ నటుడు సురేష్ ఎంట్రీ- రంగస్థలంపై హీరో, సినిమాల్లో జీరో- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సరిగ్గా ఇదే కాలాన్ని, ఆ మార్పు తెచ్చిన భావోద్వేగ సంఘర్షణను కళ్లకు కడుతూ ఇవాళ (నవంబర్ 22) ఓటీటీలోకి రంగస్థలం అనే ప్రత్యేక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు సురేష్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు.

సినిమా వెలుగుల మధ్య మసకబారిన నాటక కళ

1980ల నాటి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సుందరం అనే రంగస్థల నటుడి చుట్టూ కథనం తిరుగుతుంది. సుందరానికి నాటకమే ప్రాణం. వేదికపైకి ఎక్కి పద్యం పాడినా, డైలాగ్ చెప్పినా ఊరంతా చప్పట్లతో మారుమోగేది. అలా రంగస్థలంపై దిగ్గజ నాటకకళాకారుడిగా పేరు తెచ్చుకుంటాడు.

తన కళ పట్ల ఎంతో గర్వంతో, అంకితభావంతో బతికే సుందరం జీవితంలోకి సినిమా అనే కొత్త వినోద మాధ్యమం పెను తుఫానులా దూసుకొస్తుంది. జనం క్రమంగా నాటకాలను వదిలి సినిమా థియేటర్ల వైపు కదులుతున్న తరుణంలో సుందరం తీవ్ర మానసిక వేదనకు గురవుతాడు.

సినిమాల్లో ఇమడలేక

సుందరంకు సినిమా ఛాన్స్ కూడా వస్తుంది. కానీ, సినిమా తీసే విధానం, అందులో ఇమడలేక జీరోగా పిలిపించుకుంటాడు సుందరం. మారుతున్న కాలానికి తగ్గట్టు తనను తాను మార్చుకోవాలా, లేక నమ్ముకున్న నాటక కళ కోసమే సర్వస్వం కోల్పోవడానికి సిద్ధపడాలా అనే సందిగ్ధంలో చిక్కుకుంటాడు. సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య నలిగిపోయే ఒక సామాన్య కళాకారుడి అంతర్మథనాన్ని ఈ కథ హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు

సాంకేతిక విభాగంలోనూ ప్రతిభావంతులు ఈ చిత్రానికి పనిచేశారు. ఆనంద్ నాడకట్ల సినిమాటోగ్రఫీ అందించగా, ఎన్‌ఎక్స్‌వై లోపెజ్ (NXY Lopez) సంగీతం సమకూర్చారు. భార్గవ కార్తీక్ రాసిన సంభాషణలు కథలోని భావోద్వేగాలకు ప్రాణం పోశాయి.

ఈటీవీ విన్ ఓటీటీలో

రిషికేశ్వర్ యోగి ఎడిటింగ్, దివ్య పవన్ ప్రొడక్షన్ డిజైన్, మైత్రి జైన్ అంచలియా సౌండ్ డిజైన్, సోలమన్ ఫోలీ మిక్సింగ్, అజయ్ జై కాస్ట్యూమ్స్ ఈ పీరియడ్ డ్రామాకు సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. డాలీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ డీఐ బాధ్యతలు నిర్వర్తించింది.

వాణిజ్య హంగులు, కృత్రిమ ఎఫెక్ట్స్ కంటే మట్టి వాసన, మనుషుల భావోద్వేగాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు రంగస్థలం చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఇలాంటి రంగస్థలం ఓటీటీలో నేటి నుంచి సందడి చేస్తోంది. ఈటీవీ విన్‌లో ఇవాళ రంగస్థలం ఓటీటీ రిలీజ్ అయింది.

రంగస్థలం ఓటీటీ స్ట్రీమింగ్

ఈటీవీ విన్ పాపులర్ ఆంథాలజీ సిరీస్ 'కథాసుధ'లో భాగంగా రంగస్థలం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆదివారం విశ్రాంతి వేళ కుటుంబంతో కలిసి రంగస్థలం మూవీని ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks