Drishyam 3 OTT: కేసు కొట్టేసిన కోర్టు- ఓటీటీలోకి అఫీషియల్‌గా 500 కోట్ల క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Drishyam 3 OTT Release Official: బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3: ది కన్‌క్లూజన్ ఓటీటీ రిలీజ్‌కు అడ్డంకులు తొలగాయి. మద్రాస్ హైకోర్టు తాజాగా పిటిషన్‌ను కొట్టివేయడంతో అధికారిక ప్రకటనతో దృశ్యం 3 ఓటీటీలోకి వచ్చేయనుంది.

Published on: Nov 21, 2026, 12:08:29 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Drishyam 3 The Conclusion OTT Release Official Announcement: థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు 'దృశ్యం' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ నటించిన తెలుగు వెర్షన్లతో ఇక్కడ ఇంటింటా మారుమోగిన ఈ కథ, బాలీవుడ్‌లోనూ అజయ్ దేవగన్ హీరోగా కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంది.

కేసు కొట్టేసిన కోర్టు- ఓటీటీలోకి అఫీషియల్‌గా 500 కోట్ల క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కేసు కొట్టేసిన కోర్టు- ఓటీటీలోకి అఫీషియల్‌గా 500 కోట్ల క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్

గత రెండు భాగాలు సూపర్ హిట్ కావడంతో భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2, 2026న థియేటర్లలోకి వచ్చిన 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ మూవీ దృశ్యం 3 ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 27 నుంచి దృశ్యం 3 ది కన్‌క్లూజన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

మద్రాస్ హైకోర్టు తీర్పుతో వీడిన ఉత్కంఠ

అయితే, 'దృశ్యం 3' విడుదలకు మొదటి నుంచీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. మలయాళ మాతృక ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రీమేక్ హక్కులు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

థియేటర్లు, టీవీలు, ఓటీటీ వేదికల్లో దృశ్యం 3 సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అక్టోబర్ 1, 2026న న్యాయస్థానం ఆ అభ్యర్థనను తోసిపుచ్చడంతో మరుసటి రోజే సినిమా థియేటర్లలో విడుదలైంది.

బలమైన ఆధారాలు లేవని

తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌ను అడ్డుకోవాలంటూ సదరు సంస్థ మరోసారి హైకోర్టు తలుపు తట్టింది. గతంలో ఇదే అంశంపై ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించే బలమైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ కొత్త పిటిషన్‌ను కొట్టివేసింది మద్రాస్ హైకోర్టు. దీంతో డిజిటల్ ప్రీమియర్‌కు మార్గం సుగమమైంది.

ఈసారి విజయ్ సల్గావ్‌కర్‌కు అసలైన పరీక్ష!

దర్శకుడు అభిషేక్ పాఠక్ తెరకెక్కించిన ఈ మూడో భాగంలో కథ మరింత ఉత్కంఠభరితంగా మలుపు తిరుగుతుంది. విజయ్ సల్గావ్‌కర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అల్లిన రహస్య వలయాన్ని ఛేదించేందుకు ఈసారి ఓ కొత్త పోలీసు అధికారి రంగంలోకి దిగుతారు.

సామ్ దేశ్‌ముఖ్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభిస్తారు. ఎస్పీ రాజ్‌వీర్ సింగ్ తోమర్ పాత్రలో విలక్షణ నటుడు జైదీప్ అహ్లావత్ ఎంట్రీ ఇవ్వడంతో కథలో వేగం పెరుగుతుంది. గతంలో విజయ్ కుటుంబం చెప్పిన సాక్ష్యాలను తలకిందులు చేసే కొత్త ఆధారాలతో ఎస్పీ తోమర్ విచారణ మొదలుపెడతారు.

ఉచ్చు బిగుస్తున్న వేళ

మరోవైపు తన కుమారుడి అదృశ్యం వెనుక ఉన్న నిజం కోసం ఐజీ మీరా దేశ్‌ముఖ్ పాత్రలో టబు పోరాటం కొనసాగిస్తూనే ఉంటారు. అజయ్ దేవగన్, టబు, జైదీప్ అహ్లావత్‌లతో పాటు శ్రియా శరణ్, ఇషితా దత్తా, రజత్ కపూర్, ప్రకాష్ రాజ్, మృణాల్ జాదవ్ కీలక పాత్రల్లో నటించారు. చుట్టూ ఉచ్చు బిగుస్తున్న వేళ విజయ్ సల్గావ్‌కర్ పోలీసుల కంటే ఒక అడుగు ముందే ఉండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నారన్నది తెరపైనే చూడాలి.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ

సుమారు రూ. 100 నుంచి 110 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన దృశ్యం 3 చిత్రం విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఓపెనింగ్ డే నాడే ఏకంగా రూ. 66.75 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మొదటి వారం ముగిసేసరికి భారత్‌లో రూ. 245.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దృశ్యం 3

థియేట్రికల్ రన్ పూర్తయ్యే నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 2026లో బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో చిత్రంగా రికార్డు సృష్టించింది. థియేటర్లలో ఈ మైండ్ గేమ్‌ను మిస్ అయిన సినీ ప్రియులకు ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ కానుంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.