మా పాటను అనుమతి లేకుండా వాడారు, చిన్న సినిమాల హక్కులను కాలరాస్తారా-వెంకటేష్ ఆదర్శ కుటుంబంపై పర్ణశాల నిర్మాత వెంకట్ ఆవేదన

Venkat Manchi On Aadarsha Kutumbam Song Controversy: విడుదలకు సిద్ధమవుతున్న ‘పర్ణశాల’ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో అనుమతి లేకుండా వాడటంపై నిర్మాత వెంకట్ మంచి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాపీరైట్ ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, చిన్న సినిమాలను కాపాడాలని కోరారు.

Published on: Oct 31, 2026, 13:37:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Venkat Manchi On Aadarsha Kutumbam Song Controversy: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల మనుగడ, కాపీరైట్ హక్కులపై మరోసారి వేడివేడి చర్చ మొదలైంది. థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ 'పర్ణశాల' చిత్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమ చిత్రంలోని ప్రసిద్ధ పాటను వేరొక సినిమాలో అనుమతి లేకుండా వాడుకున్నారంటూ నిర్మాత వెంకట్ మంచి బహిరంగంగా నిరసన తెలిపారు.

మా పాటను అనుమతి లేకుండా వాడారు, చిన్న సినిమాల హక్కులను కాలరాస్తారా-వెంకటేష్ ఆదర్శ కుటుంబంపై పర్ణశాల నిర్మాత వెంకట్ ఆవేదన
మా పాటను అనుమతి లేకుండా వాడారు, చిన్న సినిమాల హక్కులను కాలరాస్తారా-వెంకటేష్ ఆదర్శ కుటుంబంపై పర్ణశాల నిర్మాత వెంకట్ ఆవేదన

కాపీరైట్ ఉల్లంఘనపై నిర్మాత ఆగ్రహం

హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ఆదర్శ కుటుంబం' చిత్రంలో తమ 'పర్ణశాల' సినిమాకి చెందిన 'జిమ్ జిమ్ తార' పాటను సుమారు 15 సెకన్ల పాటు అనుమతి లేకుండా ఉపయోగించారని ప్రొడ్యూసర్ వెంకట్ మంచి తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసిన పాటను మరో సినిమాలో ఇలా వాడటం వల్ల తమ పర్ణశాల చిత్రం ప్రచారానికి భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.

హక్కులను కాలరాస్తే ఎలా నిలదొక్కుకోవాలి?

"కష్టపడి నిర్మించిన చిన్న సినిమాల హక్కులను కాలరాస్తే మేం ఎలా నిలదొక్కుకోవాలి? అనుమతి లేకుండా మా పాటను వాడుకోవడం అన్యాయం. చిన్న సినిమాలను బతికించండి" అని 'పర్ణశాల' నిర్మాత వెంకట్ మంచి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కూడా తమ అనుమతి లేకుండా ఈ పాటను ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

పరిమితులు లేని వాడకం.. చిన్న చిత్రాలకు కోలుకోలేని దెబ్బ

టాలీవుడ్‌లో పెద్ద సినిమాలు, చిన్న సినిమాల మధ్య ఉండే వ్యత్యాసం మరోసారి ఈ వివాదంతో వెలుగులోకి వచ్చింది. నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి ప్రమోషన్లు చేసుకునే చిన్న చిత్రాల కంటెంట్‌ను పెద్ద బ్యానర్లు ఉచితంగా వాడేసుకోవడం సరైన పద్ధతి కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాపీరైట్ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం చిన్న నిర్మాతల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తోందని అంటున్నారు.

వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటున్న 'పర్ణశాల'

ఇదిలా ఉంటే, ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ పతాకంపై వెంకట్ మంచి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే చిత్రసీమలో ఆసక్తిని రేకెత్తించాయి.

లక్ష్మీదేవి గెటప్‌తో పాడించి

పర్ణశాల మూవీ ప్రమోషన్లలో భాగంగా 'జిమ్ జిమ్ తార' పాటను లక్ష్మీదేవి గెటప్‌తో పాడించి వినూత్న రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందింది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

కాపీ రైట్ వివాదంపై స్పందిస్తారా?

ఇక మరోవైపు వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేసింది. అక్టోబర్ 30న విడుదలైన ఆదర్శ కుటుంబం సినిమా ప్రస్తుతం థియేటర్లలో అలరిస్తోంది. మరి ఈ కాపీరైట్ వివాదంపై ఆదర్శ కుటుంబం టీమ్ ఏమైనా స్పందిస్తుందా లేదా చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More