Ranveer Singh: ప్రభాస్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ రికార్డులు బ్రేక్.. ఒక్క సినిమాతో రూ.325 కోట్లు అందుకున్న స్టార్ ఇతడే
Ranveer Singh: ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్టార్ గా బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ నిలిచాడు. ధురంధర్ ఫ్రాంఛైజీ కోసం అతడు ఏకంగా రూ.325 కోట్లు అందుకోవడం విశేషం. ప్రభాస్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్లు కూడా వెనకబడిపోయారు.
Ranveer Singh: ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త సంచలనం నమోదైంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ఏ టాప్ సూపర్ స్టార్ కూ సాధ్యం కాని రీతిలో.. కేవలం ఒక్క సినిమా ఫ్రాంచైజీ ద్వారా ఏకంగా రూ. 325 కోట్ల భారీ సంపాదనతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక పారితోషికం లేదా లాభాలు అందుకున్న నెంబర్ వన్ నటుడిగా రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) నిలిచినట్లు ట్రేడ్ వర్గాల తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ దగ్గర నాన్‌స్టాప్ విధ్వంసం సృష్టించిన ఒక భారీ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ వల్లే ఆయనకు ఈ రేంజ్ లో లాభాలు దక్కాయి.
రూ. 3,200 కోట్ల బాక్సాఫీస్ సంచలనం.. ‘ధురంధర్’
రణ్‌వీర్ సింగ్ కు ఈ చారిత్రాత్మక సంపాదనను తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్ మరేదో కాదు.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన రెండు భాగాల యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ 'ధురంధర్' (Dhurandhar). మొదట ఒకే షెడ్యూల్ లో ఒకే చిత్రంగా ప్లాన్ చేసి షూట్ చేసిన ఈ సినిమాను ఆ తర్వాత రెండు భాగాలుగా విడుదల చేశారు.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్ లో ఏకంగా రూ. 3,200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయి. కేవలం ఇండియాలోనే రూ. 1,900 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ భారీ సక్సెస్ తో రణవీర్ సింగ్ ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ స్టార్ గా అవతరించారు.
ప్రాఫిట్ షేరింగ్ మ్యాజికల్ స్కెచ్..
సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు ఒక సినిమాకు ఇంత అని రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తారు. కానీ రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాకు చాలా స్మార్ట్ గా ఆలోచించి 'ప్రాఫిట్ షేరింగ్' (లాభాల్లో వాటా) అగ్రిమెంట్ చేసుకున్నారు. అంతేకాదు షూటింగ్ సమయంలో బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో.. రణ్‌వీర్ స్వయంగా తన సొంత డబ్బును కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో సినిమా లాభాల్లో ఆయన వాటా మరింత పెరిగింది.
సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక వచ్చిన భారీ వసూళ్లు, డిస్ట్రిబ్యూషన్ బోనస్‌లు, వీటికి తోడు డిజిటల్ (ఓటీటీ), సాటిలైట్, మ్యూజిక్ హక్కుల ద్వారా వచ్చిన మొత్తం బిజినెస్ లాభాలను లెక్కించగా.. రణ్‌వీర్ సింగ్ వాటా కిందకు ఏకంగా రూ. 325 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ లోని ప్రొడక్షన్ హౌసెస్ కు మెజారిటీ లాభాలు వెళ్లినప్పటికీ.. ఒక సింగిల్ ప్రాజెక్ట్ నుంచి ఒక ఇండియన్ యాక్టర్ అందుకున్న బిగ్గెస్ట్ పేఅవుట్ ఇదే కావడం విశేషం.
రజనీ, షారుఖ్, అల్లు అర్జున్ రికార్డులు అవుట్!
ఈ భారీ సంపాదనతో రణ్‌వీర్ సింగ్ టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను దాటేశారు. దీనికంటే ముందు ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ రికార్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరిట ఉండేది. ఆయన 'జైలర్' సినిమాకు రూ. 250 కోట్లకు పైగా అందుకున్నట్లు టాక్ ఉంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సినిమాకు, రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రూ. 200 కోట్ల మార్కును దాటేశారు.
బాలీవుడ్ లో అంతకుముందు కింగ్ షారుఖ్ ఖాన్ 2023 లో వచ్చిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలకు ఒక్కో దానికి రూ. 200 కోట్ల వరకు ప్రాఫిట్స్ రూపంలో అందుకుని టాప్ లో ఉండేవారు. గతంలో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు కూడా ఇలాంటి ప్రాఫిట్ షేరింగ్ డీల్స్ తోనే భారీగా సంపాదించేవారు. కానీ ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ ఏకంగా రూ. 325 కోట్లతో వాళ్లందరినీ వెనక్కి నెట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త మైల్‌స్టోన్ సెట్ చేశారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం స్టార్ హీరోలు కేవలం ఫీజు మాత్రమే నమ్ముకోకుండా.. ఇలా లాభాల్లో వాటాలు తీసుకోవడం వల్లే ఇంతటి భారీ వసూళ్లు సాధ్యమవుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


