భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ విజయం నమోదైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 845 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
కనుమరుగైన 'ఛావా' రికార్డు

ఈ ఏడాది ఇప్పటివరకు విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన 'ఛావా' (రూ. 807 కోట్లు) అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ఉండేది. అయితే, తాజాగా 'ధురంధర్' ఆ రికార్డును బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకుంది.
భారత దేశీయ మార్కెట్‌లో ఇప్పటివరకు దురంధర్ సినిమా రూ. 555.75 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అంతర్జాతీయంగా కూడా రణ్‌వీర్ మేనియా గట్టిగా కనిపిస్తోంది. సుమారు 20 మిలియన్ డాలర్ల ఓవర్సీస్ వసూళ్లతో దురంధర్ సినిమా తన హవా చాటుతోంది.
హాలీవుడ్ 'అవతార్ 3'పై భారతీయ పవర్!
భారత బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' తో తలపడినప్పటికీ 'ధురంధర్' పైచేయి సాధించడం విశేషం. జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకుడి సినిమా విడుదలైనా రణవీర్ సింగ్ మూవీ ఏమాత్రం తగ్గకుండా థియేటర్లను హౌస్‌ఫుల్‌తో దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఈ సినిమా రిషబ్ శెట్టి 'కాంతార: ది లెజెండ్ - చాప్టర్ 1' (రూ. 852 కోట్లు) వసూళ్లను అధిగమించే దిశగా పయనిస్తోంది. ఇదే జోరు కొనసాగితే, నూతన సంవత్సరం లోపు రూ. 1000 కోట్ల క్లబ్‌లో దురంధర్ చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
కరాచీ గడ్డపై ఇండియన్ ఏజెంట్ సాహసం
దర్శకుడు ఆదిత్య ధర్ ధురందర్ చిత్రాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలిచారు. రణ్‌వీర్ సింగ్ 'హంజా' అనే భారతీయ ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయారు. కరాచీలోని టెర్రర్ నెట్‌వర్క్‌లను ఛేదించే ఒక ఇన్వెస్టిగేటివ్ స్పైగా రణ్‌వీర్ తన కెరీర్లోనే అత్యుత్తమ నటనను కనబరిచారు.
{{/usCountry}}దర్శకుడు ఆదిత్య ధర్ ధురందర్ చిత్రాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలిచారు. రణ్‌వీర్ సింగ్ 'హంజా' అనే భారతీయ ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయారు. కరాచీలోని టెర్రర్ నెట్‌వర్క్‌లను ఛేదించే ఒక ఇన్వెస్టిగేటివ్ స్పైగా రణ్‌వీర్ తన కెరీర్లోనే అత్యుత్తమ నటనను కనబరిచారు.
{{/usCountry}}దురంధర్ సినిమాలో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ సారా అర్జున్ యాక్ట్ చేసింది. ఆమెతోపాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి స్టార్ నటులు తమ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పిల్లర్లుగా నిలిచారు.
దురంధర్ 2 రిలీజ్ డేట్
ఇదిలా ఉంటే ధురందర్ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ధురంధర్ 2 వచ్చే ఏడాది మార్చి 2026లో విడుదల కానుంది. దురంధర్ హిట్‌తో పార్ట్ 2పై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.