బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ధురంధర్’ వసూళ్ల వర్షం కురిపిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ఈ సినిమా పలు భారీ రికార్డులను తుడిచిపెట్టేసింది.
తగ్గిన దురంధర్ కలెక్షన్స్

తాజాగా దురంధర్ చిత్రం 2025 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా అగ్రస్థానానికి చేరుకుంది. మూడవ సోమవారం (డిసెంబర్ 22) ఈ సినిమా వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ ఓవరాల్‌గా మాత్రం తన దూకుడును అస్సలు తగ్గించడం లేదు.
కాంతార 2, ఛావా రికార్డులు కనుమరుగు!
ఇప్పటివరకు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా ఉన్న రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ (రూ. 852 కోట్లు), విక్కీ కౌశల్-రష్మిక మందన్నాల ‘ఛావా’ (రూ. 807 కోట్లు) రికార్డులను ‘ధురంధర్’ అధిగమించింది. 18 రోజులు ముగిసేసరికి దురంధర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 872 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.
హాలీవుడ్ దిగ్గజం ‘అవతార్ 3’తో పోటీపడి మరీ..
జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైనప్పటికీ ‘ధురంధర్’ తన హవాను కొనసాగించడం విశేషంగా మారింది. విదేశీ మార్కెట్లలోనూ దురంధర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.
టాప్ 10 ఇండియన్ సినిమాల జాబితా
ఇప్పటివరకు ఓవర్సీస్లో 20.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 170 కోట్లు) కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది దురంధర్ సినిమా. ఇదే ఊపు కొనసాగితే రాబోయే రెండు మూడు రోజుల్లోనే రూ. 915 కోట్ల క్లబ్లో చేరి ఆల్టైమ్ టాప్ 10 ఇండియన్ సినిమాల జాబితాలోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది రణ్‌వీర్ సింగ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
భారతదేశంలో వసూళ్ల ప్రవాహం
{{/usCountry}}ఇప్పటివరకు ఓవర్సీస్లో 20.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 170 కోట్లు) కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది దురంధర్ సినిమా. ఇదే ఊపు కొనసాగితే రాబోయే రెండు మూడు రోజుల్లోనే రూ. 915 కోట్ల క్లబ్లో చేరి ఆల్టైమ్ టాప్ 10 ఇండియన్ సినిమాల జాబితాలోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది రణ్‌వీర్ సింగ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
భారతదేశంలో వసూళ్ల ప్రవాహం
{{/usCountry}}ఇక దురంధర్ సినిమా ఇండియాల 18 రోజుల్లో రూ. 571.75 కోట్ల నెట్ (రూ. 686 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ వసూల చేసింది. మూడవ సోమవారం నాడు దాదాపు 60 శాతం డ్రాప్ కనిపించినప్పటికీ రూ. 16 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
సినిమా గురించి క్లుప్తంగా..
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్ ‘హంజా’ అనే ఇండియన్ ఏజెంట్ పాత్రలో నటించారు. కరాచీలోని టెర్రర్ నెట్‌వర్క్స్‌ను ఛేదించే ఒక సీక్రెట్ ఆపరేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.