బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా చేసిన వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ రెండో వారంలోనూ తన జోరు చూపిస్తోంది. వీకెండ్ ముగిసి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో వసూళ్లలో సహజమైన తగ్గుదల కనిపించినప్పటికీ, ఓవరాల్‌గా ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు మాత్రం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.
12వ రోజు వసూళ్ల రిపోర్ట్

ధురంధర్ 2 సినిమా విడుదలైన 12వ రోజు (రెండో సోమవారం మార్చి 30) అంటే నిన్న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.30 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో దేశీయంగా ఈ చిత్రం మొత్తంగా రూ. 872.17 కోట్ల నెట్ (రూ. 1,042.23 కోట్ల గ్రాస్) మార్కును చేరుకుంది.
కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తన సత్తా చాటుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటివరకు ధురంధర్ 2 రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్ 2’ వసూళ్లు రూ. 1,392.23 కోట్లకు చేరుకున్నాయి. అంటే, దాదాపుగా రూ. 1400 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరిలో ఉంది ఈ సినిమా.
వసూళ్లలో తగ్గుదల.. ట్రేడ్ అనలిస్టులు ఏమంటున్నారు?
రెండో ఆదివారం (మార్చి 29) రూ. 68.10 కోట్ల భారీ వసూళ్లు సాధించిన ధురంధర్ 2 సోమవారం నాటికి 62.8 శాతం తగ్గుదలని నమోదు చేసింది. "పెద్ద సినిమాలకు వీకెండ్ తర్వాత సోమవారం వసూళ్లు తగ్గడం చాలా సహజమైన ప్రక్రియ. ఆదివారం 48.5 శాతంగా ఉన్న థియేటర్ ఆక్యుపెన్సీ, సోమవారం 22.6 శాతానికి పడిపోయింది.
అయితే దేశవ్యాప్తంగా ఇంకా 17,592 షోలతో ధురంధర్ 2 సినిమా నడుస్తుండటం విశేషం. ఇది ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఉన్న ఆసక్తిని, ఎగ్జిబిటర్ల నమ్మకాన్ని తెలియజేస్తోంది" అని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రణ్‌వీర్ సింగ్ మ్యాజిక్
{{/usCountry}}అయితే దేశవ్యాప్తంగా ఇంకా 17,592 షోలతో ధురంధర్ 2 సినిమా నడుస్తుండటం విశేషం. ఇది ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఉన్న ఆసక్తిని, ఎగ్జిబిటర్ల నమ్మకాన్ని తెలియజేస్తోంది" అని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రణ్‌వీర్ సింగ్ మ్యాజిక్
{{/usCountry}}ఇదిలా ఉంటే, ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ పోషించిన గూఢచారి పాత్రకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. అతిగా కాకుండా, ఎంతో హుందాగా ఆయన చేసిన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అందుకే చాలా మంది ఈ సినిమాను రెండోసారి, మూడోసారి కూడా చూస్తున్నారు. విదేశీ మార్కెట్లలో నిలకడగా వసూళ్లు రావడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం, ‘ధురంధర్ 2’ తన విజయయాత్రను ఇలాగే కొనసాగిస్తే మరిన్ని రికార్డులు కనుమరుగవ్వడం ఖాయం. రెండో వారం వర్కింగ్ డేస్‌లో నిలకడగా ఉండి, వచ్చే వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంటే ధురంధర్ 2 సినిమా రూ. 1,500 కోట్ల మైలురాయిని సులువుగా దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.