ప్రస్తుతం భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ప్రభంజనం కొనసాగుతోంది. రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ఈ చిత్రం మూడో వారాంతంలో (Third Weekend) అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. శుక్ర, శనివారాల్లో వసూళ్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు రూ. 1600 కోట్ల మార్కు దిశగా దూసుకుపోతోంది. హిందీ సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ చిత్రానికీ సాధ్యం కాని రీతిలో, కేవలం భారత్‌లోనే రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టేందుకు ఈ సినిమా సిద్ధమైంది.
సరికొత్త రికార్డుల వేటలో హమ్జా!

మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన 'ధురంధర్ 2' మూడో వారం ప్రారంభం నాటికి రూ. 1500 కోట్ల మైలురాయిని దాటేసింది. 17వ రోజైన శనివారం (ఏప్రిల్ 4) నాడు ఇండియాలో రూ. 25.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది ధురంధర్ 2 చిత్రం.
శుక్రవారం నుంచి శనివారం నాటికి వసూళ్లలో 20 శాతం పెరుగుదల కనిపించడం విశేషం. దీంతో 17 రోజుల్లో ఇండియాలో ధురంధర్ 2 సినిమా రూ. 985 కోట్ల నెట్, రూ. 1179 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మరో రెండు రోజుల్లో ఇది రూ. 1000 కోట్ల నెట్ మార్కును తాకడం ఖాయంగా కనిపిస్తోంది.
ఓవర్సీస్‌లో 'బాహుబలి 2' రికార్డు బ్రేక్
విదేశాల్లోనూ ధురంధర్ 2 సినిమా ఒక సునామీలా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా మార్కెట్‌లో (ఓవర్సీస్) 'బాహుబలి 2' పేరిట ఉన్న 9 ఏళ్ల నాటి రికార్డును ధురంధర్ 2 తుడిచిపెట్టేసింది.
రెండో వారం నాటికి అంతర్జాతీయంగా 30 మిలియన్ డాలర్లు దాటిన ఈ చిత్రం, మూడో శనివారం ఏకంగా 100 శాతం వృద్ధిని నమోదు చేసి 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 41.5 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 386 కోట్లు) చేరుకుంది. బాహుబలి 2కి ఓవర్సీస్‌లో వచ్చిన రూ. 371.16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది ధురంధర్ 2.
టాప్ చిత్రాల జాబితాలోకి..
ప్రస్తుతం 'ధురంధర్ 2' మొత్తం 17 రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ రూ. 1565 కోట్లుగా ఉన్నాయి. అల్లు అర్జున్ 'పుష్ప 2' (రూ. 1724 కోట్లు), ప్రభాస్ 'బాహుబలి 2' (రూ. 1788 కోట్లు) రికార్డులకు ఈ సినిమా చేరువలో ఉంది.
{{/usCountry}}ప్రస్తుతం 'ధురంధర్ 2' మొత్తం 17 రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ రూ. 1565 కోట్లుగా ఉన్నాయి. అల్లు అర్జున్ 'పుష్ప 2' (రూ. 1724 కోట్లు), ప్రభాస్ 'బాహుబలి 2' (రూ. 1788 కోట్లు) రికార్డులకు ఈ సినిమా చేరువలో ఉంది.
{{/usCountry}}ధురంర్ 2 థియేట్రికల్ ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ రెండు సినిమాలను దాటే అవకాశం ఉంది. కానీ, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 'దంగల్' (రూ. 2070 కోట్లు) రికార్డును అందుకోవడం మాత్రం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 'దంగల్' వసూళ్లలో మెజారిటీ భాగం చైనా నుంచి రావడం గమనార్హం.
అంతకుమించిన విజయం
కాగా మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తోపాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులు, బ్యూటిఫుల్ సారా అర్జున్ నటించారు. గతేడాది వచ్చిన మొదటి భాగం రూ. 1300 కోట్లు వసూలు చేయగా, రెండో భాగం అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుని భారతీయ సినిమా సత్తాను చాటుతోంది.