...
...
Next Story

Ranveer Deepika: ధురంధర్ 2 సక్సెస్ జోష్: భార్య దీపికాతో రణ్‌వీర్ సింగ్ లంచ్ డేట్.. సోషల్ మీడియా విమర్శలకు చెక్!

Ranveer Deepika: ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న వేళ, రణ్‌వీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనేతో కలిసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాడు. లంచ్ డేట్ ఫోటోలతో విమర్శకులకు ఈ జోడీ గట్టి సమాధానం ఇచ్చింది.

Published on: Mar 23, 2026, 08:33:25 IST
Advertisement

బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్: ది రివెంజ్' సృష్టిస్తున్న ప్రభంజనంతో రణ్‌వీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.450 కోట్ల వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఈ భారీ విజయం నేపథ్యంలో రణ్‌వీర్ తన భార్య దీపికా పదుకొనేతో కలిసి లంచ్ డేట్ తో సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాడు.

రణ్‌వీర్, దీపికా సందడి

హోటల్ స్టాఫ్ తో రణ్‌వీర్, దీపికా పదుకొనే
హోటల్ స్టాఫ్ తో రణ్‌వీర్, దీపికా పదుకొనే

బాలీవుడ్ లో మోస్ట్ ఎనర్జిటిక్ కపుల్ ఎవరంటే రణ్‌వీర్, దీపికా పేరే వినిపిస్తుంది. ఈ జంట తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో సందడి చేశారు. వీరిద్దరూ కలిసి రిలాక్స్‌డ్ లంచ్ డేట్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఫొటోలు వైరర్

మసాలీ సీఫుడ్ రెస్టారెంట్ లోపల రణ్‌వీర్, దీపికా అక్కడి సిబ్బందితో కలిసి నవ్వుతూ దిగిన ఫోటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీపికా వైట్ టీ-షర్ట్, బ్లూ జీన్స్‌లో క్యాజువల్ లుక్‌లో మెరిసింది. రణ్‌వీర్ ఏమో బ్లూ టీషర్ట్, జీన్స్‌తో కూల్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. హేటర్స్ నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నా, ఈ 'గోల్డెన్ కపుల్' మాత్రం చాలా హ్యాపీగా ఉందంటూ ఈ ఫొటోలతో అభిమానులు విమర్శకులకు చురకలు అంటిస్తున్నారు.

దీపికా మౌనంపై విమర్శలు

రణ్‌వీర్ నటించిన ధురంధర్ 2 గురించి ఇప్పటివరకూ దీపికా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయలేదని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ మూవీని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. కానీ దీపికా మాత్రం సైలెంట్ గా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రణ్‌వీర్, దీపికా కలిసి బయట కనిపించడం ద్వారా ఆ విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చినట్లయింది.

ఫ్యాన్స్ సపోర్ట్

ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులు

మార్చి 19న విడుదలైన 'ధురంధర్: ది రివెంజ్' అంచనాలను మించి అద్భుతమైన ప్రదర్శనతో బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తోంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ హమ్జా అలీ మజారీ, జస్కిరాత్ సింగ్ రంగి అనే రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటించి మెప్పించాడు. పాకిస్తాన్‌లో పనిచేస్తున్న భారతీయ గూఢచారిగా అతని ప్రయాణం, ఉగ్రవాదులను చంపే ఆపరేషన్ ను డైరెక్టర్ ఆదిత్య ధర్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks