...
...
Next Story

Dhurandhar 2 Ticket Price: 3100కు ఎగబాకిన ధురంధర్ టికెట్ ధర- అక్కడ మాత్రం పరిమితిలో- పవన్ కల్యాణ్ ఓజీ రికార్డుపై కన్ను!

Dhurandhar 2 Advance Booking Ticket Price Record: రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 రిలీజ్ కాకముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 18న పెయిడ్ ప్రివ్యూలు ప్రారంభం కానుండగా.. ఒక్కో టికెట్ ధర రూ. 3100 పలుకుతోంది. భారీ ధరలు ఉన్నా ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి.

Published on: Mar 10, 2026, 10:40:41 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ మూవీ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి సిద్ధమైంది. ధురంధర్ ది రివేంజ్ సినిమా విడుదలకు ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉన్నప్పటికీ, అప్పుడే టికెట్ల వేట మొదలైంది.

అంతకంటే ముందు రోజు

3100కు ఎగబాకిన ధురంధర్ టికెట్ ధర- అక్కడ మాత్రం పరిమితిలో- పవన్ కల్యాణ్ ఓజీ రికార్డుపై కన్ను!
3100కు ఎగబాకిన ధురంధర్ టికెట్ ధర- అక్కడ మాత్రం పరిమితిలో- పవన్ కల్యాణ్ ఓజీ రికార్డుపై కన్ను!

మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ధురంధర్ 2 అంతకంటే ముందు రోజు అంటే మార్చి 18 సాయంత్రం 4-5 గంటల నుంచి భారత్ అంతటా ఎంపిక చేసిన థియేటర్లలో ‘పెయిడ్ ప్రివ్యూస్’ ద్వారా సందడి చేయనుంది.

ఆకాశాన్నంటుతున్న టికెట్ ధరలు

ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ యాజమాన్యాలు ధురంధర్ 2 టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. మెట్రో నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో సాధారణ టికెట్ ధర రూ. 600 నుంచి రూ. 900 వరకు ఉండగా, ఐమాక్స్ (IMAX) షోల ధర రూ. 1000 దాటేసింది.

సామాన్యుడికి దిమ్మతిరగాల్సిందే

ఇక లగ్జరీ సీట్లు, రెక్లైనర్ల ధరలు చూస్తే సామాన్యుడికి దిమ్మతిరగాల్సిందే. ముంబై బోరివలిలోని ఐనాక్స్ (INOX) మెగాప్లెక్స్‌లో రెక్లైనర్ సీటు ధర ఏకంగా రూ. 3100గా ఉంది. ఢిల్లీలోని పీవీఆర్ సెలెక్ట్ సిటీ వాక్‌లో కూడా రూ. 2400 పలుకుతోంది. విచిత్రమేమిటంటే, ఇంత భారీ ధరలు ఉన్నప్పటికీ ప్రివ్యూ షోలన్నీ ఇప్పటికే దాదాపు ‘హౌస్ ఫుల్’ అయిపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

అక్కడ మాత్రం పరిమితిలో

తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ సగటు టికెట్ ధర సాధారణం కంటే ఎక్కువగా రూ. 230 వద్ద కొనసాగుతోంది. అయితే తమిళనాడులో టికెట్ ధరలపై పరిమితి (Price Cap) ఉండటంతో అక్కడ సగటున రూ. 166కే టికెట్ దొరుకుతోంది.

పవన్ కల్యాణ్ 'ఓజీ' రికార్డుపై కన్ను

ఇదే ఊపు కొనసాగితే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (OG) సినిమా పేరిట ఉన్న రూ. 25 కోట్ల పాన్-ఇండియా రికార్డును ‘ధురంధర్ 2’ తుడిచిపెట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోసారి పాకిస్తాన్‌లో రౌడీ ఏజెంట్!

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ భారతీయ గూఢచారిగా పాకిస్తాన్‌లో చేసే సాహసాలు హైలైట్ కానున్నాయి. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ హిస్టరీలోనే రెండో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో

ఈ రెండో భాగంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మార్చి 18న ప్రారంభమయ్యే ఈ యాక్షన్ రచ్చ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్ టికెట్ ధరలు
 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe