బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ "ధురంధర్" బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1,300 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇందులో కేవలం భారతీయ మార్కెట్ నుంచే రూ.1,000 కోట్లు రావడం విశేషం. ఈ భారీ విజయం తర్వాత, దీనికి సీక్వెల్‌గా ‘‘ధురంధర్ 2’’ రేపు (మార్చి 19) ప్రేక్షకులు ముందుకు రానుంది.
రణ్‌వీర్ సింగ్ కామెంట్లు

ధురంధర్ 2 మ్యూజిక్ లాంచ్ కార్యక్రమంలో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. "ధురంధర్ ఇంతటి చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూపించిన ప్రేమే. మా టీమ్ పడిన కష్టానికి దక్కిన గౌరవం ఇది. ఇప్పుడు సీక్వెల్‌పై ఉన్న అంచనాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ అంచనాలను నమ్మలేకపోతున్నా" అని పేర్కొన్నాడు.
సంగీతమే ఈ సినిమా ఆత్మ
ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలకు జాతీయ అవార్డు గ్రహీత శశాంక్ సచ్‌దేవ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రణ్‌వీర్ మాట్లాడుతూ.. శశాంక్ ఒక "మ్యూజికల్ జగ్గర్నాట్" అని, భవిష్యత్తులో గొప్ప సంగీత దర్శకుడిగా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించాడు.
కాలేజీలు, జిమ్‌లు ఇలా ఎక్కడ చూసినా ధురంధర్ పాటలే వినిపిస్తుండటం ఒక ఆర్టిస్ట్ గా తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని రణ్‌వీర్ తెలిపాడు. ఈ సినిమాకు సంగీతమే ఆత్మ అని అతను చెప్పాడు.
ధురంధర్ 2 రిలీజ్
భారీ అంచనాల మధ్య ధురంధర్ 2 గురువారం (మార్చి 19) రిలీజ్ కానుంది. ఉగాది, ఈద్ సందర్భంగా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు ఈ మూవీ వచ్చేస్తుంది. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కు అదిరే డిమాండ్ నెలకొంది. ఇప్పటికే టికెట్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లు దాటింది. ఆదిథ్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ పై కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందనే అంచనాలున్నాయి.
రణ్‌వీర్ సింగ్ యాక్షన్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ స్పై థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సారా అర్జున్ కీలక పాత్రలో నటించింది. సీక్వెల్లో రణ్‌వీర్ తన 'హమ్జా' పాత్రలో మరోసారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. ఇందులో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ తదితరులు కూడా నటించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ నిర్మించాయి.
{{/usCountry}}ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ స్పై థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సారా అర్జున్ కీలక పాత్రలో నటించింది. సీక్వెల్లో రణ్‌వీర్ తన 'హమ్జా' పాత్రలో మరోసారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. ఇందులో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ తదితరులు కూడా నటించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ నిర్మించాయి.
{{/usCountry}}