...
...
Next Story

Rao Bahadur OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న రావు బహదూర్.. మరో మూడు రోజుల్లోనే.. డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో స‌ర్‌ప్రైజ్‌!

Rao Bahadur OTT: రీసెంట్ గా టాాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మూవీ ‘రావు బహదూర్’. డిఫరెంట్ మేకింగ్ కారణంగా ఇది వార్తల్లో నిలిచింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ లో స‌ర్‌ప్రైజ్‌ ఉంది.

Published on: Jul 28, 2026, 12:11:19 IST
Advertisement

Rao Bahadur OTT: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev), వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న సైకాలాజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్' (Rao Bahadur). థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

రావు బహదూర్ ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేస్తున్న రావు బహదూర్.. మరో మూడు రోజుల్లోనే.. డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో స‌ర్‌ప్రైజ్‌! (x/Netflix_INSouth)
ఓటీటీలోకి వచ్చేస్తున్న రావు బహదూర్.. మరో మూడు రోజుల్లోనే.. డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో స‌ర్‌ప్రైజ్‌! (x/Netflix_INSouth)

'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి క్లాసిక్ హిట్ తర్వాత సత్యదేవ్- వెంకటేష్ మహా కలయికలో వచ్చిన రావు బహదూర్ మూవీ సోషల్ మీడియాలోనూ మంచి చర్చకు దారితీసింది. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సస్పెన్స్ డ్రామా, ఇప్పుడు ఓటీటీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

5 భాషల్లో బిగ్ సర్ ప్రైజ్

ఓటీటీలో రావు బహదూర్ కేవలం తెలుగులోనే రావడం లేదు. తెలుగు వెర్షన్ మాత్రమే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తుండటం విశేషం. పాన్-ఇండియా స్థాయిలో సైకాలాజికల్ థ్రిల్లర్లను ఆదరించే మల్టీ-లింగ్వల్ ఆడియన్స్ వద్దకు రీచ్ అవ్వడానికి ఈ నిర్ణయం ఎంతో తోడ్పడనుంది.

స్టోరీ ఇదే

రాజ వంశపు వారసుడైన రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) ప్రాణాపాయ స్థితిలో మంచాన పడతాడు. అతనిని పరీక్షించడానికి వైద్యుల బృందం వస్తుంది. మెడికల్ పరంగా అతణ్ని ఒక అద్భుతంగా చూస్తారు. తీవ్రమైన మానసిక రుగ్మతలతో రావు బహదూర్ బాధపడుతుంటాడు.

రావు బహదూర్ చిత్రంలో దీపా థామస్ (Deepa Thomas) హీరోయిన్ గా చేసింది. వికాస్ ముప్పాల, బాలా పారాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషించారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, స్మరణ్ సాయి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనంలోని ఇంటెన్సిటీని పెంచడంలో కీలకంగా నిలిచింది.

ఆ ఛాన్స్

డిజిటల్ కంటెంట్ ట్రెండ్స్ ప్రకారం, థియేటర్లలో క్లాస్, సస్పెన్స్ లవర్స్‌ను ఆకట్టుకున్న మిడ్-బడ్జెట్ కాన్సెప్ట్ చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ వంటి వేదికలపై అత్యధిక వ్యూయర్‌షిప్ సాధిస్తుంటాయి. వెంకటేష్ మహా మైండ్ గేమ్స్ సీన్లు, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్, సత్యదేవ్ నటనలోని వైవిధ్యం కారణంగా ఈ చిత్రం డిజిటల్ స్పేస్‌లో లాంగ్ రన్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe