Rasha Thadani: ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కడ చూసినా స్టార్ కిడ్ రాషా తడాని పేరే మారుమోగుతోంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చలాకీతనంతో ఇప్పటికే యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అలనాటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ రవీనా టాండన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాషా.. బాలీవుడ్ కంటే ముందు టాలీవుడ్ పైనే గట్టిగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
'శ్రీనివాస మంగాపురం'తో గ్రాండ్ ఎంట్రీ

రాషా తడాని తెలుగు ఎంట్రీ చాలా సాలిడ్‌గా జరిగిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, స్వర్గీయ రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అయిన 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో రాషా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఇప్పటికే విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఘట్టమనేని కాంపౌండ్ నుంచి లాంచ్ అవ్వడం ఆమె కెరీర్‌కు భారీ ప్లస్ పాయింట్ గా మారింది.
ఇప్పుడు నందమూరి హీరోతో జాక్‌పాట్
మొదటి సినిమా రిలీజ్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న వెంటనే.. రాషా తడాని మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ అరంగేట్ర సినిమాలో హీరోయిన్గా రాషాను దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఫాంటసీ, మైథలాజికల్ అంశాలతో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో.. మోక్షజ్ఞకు జోడీగా రాషా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట.
శ్రీలీల ప్లేస్‌లో ఇద్దరు స్టార్ కిడ్స్ మ్యాజిక్
వాస్తవానికి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని ముందుగా గట్టిగా ప్రచారం జరిగింది. కానీ, ఒక స్టార్ హీరోయిన్ కంటే కూడా.. ఫ్రెష్‌గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన మరో స్టార్ కిడ్ అయితే ఇద్దరి మధ్య స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉంటుందని యూనిట్ భావించిందట. అందుకే శ్రీలీల ప్లేస్‌లో రాషాను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. మోక్షజ్ఞ, రాషాల కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
స్టార్ కిడ్స్ లక్ అంటే ఇదే కదా!
{{/usCountry}}వాస్తవానికి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని ముందుగా గట్టిగా ప్రచారం జరిగింది. కానీ, ఒక స్టార్ హీరోయిన్ కంటే కూడా.. ఫ్రెష్‌గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన మరో స్టార్ కిడ్ అయితే ఇద్దరి మధ్య స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉంటుందని యూనిట్ భావించిందట. అందుకే శ్రీలీల ప్లేస్‌లో రాషాను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. మోక్షజ్ఞ, రాషాల కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
స్టార్ కిడ్స్ లక్ అంటే ఇదే కదా!
{{/usCountry}}ఇలా తెలుగులో రాషా తడాని మొదటి రెండు సినిమాలే ఇద్దరు బడా ఫ్యామిలీల వారసులతో కావడం విశేషం. ఒకవైపు ఘట్టమనేని జయకృష్ణ, మరోవైపు నందమూరి మోక్షజ్ఞ.. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ రావడం మామూలు లక్ కాదు. మోక్షజ్ఞ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయితే.. టాలీవుడ్లో రాషా తడాని టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయి చక్రం తిప్పడం ఖాయం. త్వరలోనే మోక్షజ్ఞ మూవీ టీమ్ నుంచి రాషా ఎంట్రీపై అధికారిక ప్రకటన రానుంది.
రంగంలోకి బాలయ్య
ఈ సినిమాలో కేవలం రాషా మాత్రమే కాదు, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా కథను మలుపు తిప్పే ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించనుందనే టాక్ నడుస్తోంది. అలాగే బాలకృష్ణ కూడా ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఇలా బాలీవుడ్ నుంచి రాషా, కాజోల్ రాకతో ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.