Rashi Singh: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు ఆదాయం పొందేందుకు అందుబాటులోకి వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ 'సబ్‌స్క్రిప్షన్' (Instagram Subscriptions) ఫీచర్‌పై గత కొద్దిరోజులుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో న్యూడ్ ఫొటోలు, వీడియోలు పెడుతూ చెడగొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రాశి సింగ్ రియాక్షన్

ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో సెలబ్రిటీలు తమ సబ్ స్క్రైబర్ల నుంచి నెలకు రూ.399 అలా మనీ ఛార్జ్ చేస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ను వాళ్లకు మాత్రమే అందిస్తున్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు అర్ధనగ్న ఫొటోలు, ఎక్స్ పోజింగ్ వీడియోలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రాశి సింగ్ రియాక్టయింది.
అభిమానుల నుంచి నెలవారీగా డబ్బు చేయడంపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఈ అంశంపై టాలీవుడ్ కథానాయిక రాశి సింగ్ (Rashi Singh) చాలా స్పష్టంగా స్పందించింది.
అది వారి ఖాతా.. వారి ఇష్టం!
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ల విధానంపై జరుగుతున్న ప్రచారంపై రాశి సింగ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించింది. "ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్స్ విధానంలో నాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు. అది వారి వ్యక్తిగత ఖాతా, వారి ఇష్టం.
ఆ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌తో మీకు ఏమైనా అభ్యంతరం లేదా సమస్య ఉంటే, సింపుల్‌గా సబ్‌స్క్రైబ్ చేసుకోకండి. అంతేకానీ విమర్శలు చేయడం సమంజసం కాదు" అని రాశి సింగ్ సంచలన కామెంట్లు చేసింది. దీంతో క్రియేటర్లకు తమ ఖాతాల ద్వారా సంపాదించుకునే హక్కు ఉందనే సంకేతాన్ని ఆమె ఇచ్చినట్లయింది.
ఆదాయం కోసం
సినిమాల్లో ఆఫర్లు ఎప్పుడూ ఒకేలా ఉండవని, నటీనటులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉండటం ముఖ్యమని పరిశ్రమ వర్గాలు భావిస్తుంటాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాను ఉపయోగిస్తూ బ్రాండ్ ప్రమోషన్లు లేదా సబ్‌స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పొందడం తప్పు కాదని రాశి సింగ్ అభిప్రాయపడింది.
తెలుగు సినిమాల్లో
{{/usCountry}}సినిమాల్లో ఆఫర్లు ఎప్పుడూ ఒకేలా ఉండవని, నటీనటులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉండటం ముఖ్యమని పరిశ్రమ వర్గాలు భావిస్తుంటాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాను ఉపయోగిస్తూ బ్రాండ్ ప్రమోషన్లు లేదా సబ్‌స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పొందడం తప్పు కాదని రాశి సింగ్ అభిప్రాయపడింది.
తెలుగు సినిమాల్లో
{{/usCountry}}ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాశి సింగ్ తెలుగులో హీరోయిన్ గా కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. మొదట ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసి ఆ తర్వాత 'శశి' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'ప్రసన్న వదనం', 'భూతద్దం భాస్కర్ నారాయణ', 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' వంటి సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్‌లలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో రాశి సింగ్ నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది.
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖులు ప్రత్యేక ఫోటోలు, వీడియోలు లేదా లైవ్ సెషన్ల కోసం సబ్‌స్క్రిప్షన్ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిపై నెటిజన్ల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్రియేటర్లు పడే శ్రమకు ఇది ఒక ప్రతిఫలమని కొందరు మద్దతు తెలుపుతుంటే, ఉచితంగా చూసే ప్లాట్‌ఫామ్‌పై చార్జీలు విధించడం సరికాదని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశి సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.