నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే రష్మిక మందన్నా నటించిన థామా మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు మరో సినిమాతో అలరించేందుకు రెడీ అయింది బ్యూటిపుల్ రష్మిక మందన్నా. ఆ సినిమానే "ది గర్ల్‌ఫ్రెండ్".
హీరో కమ్ డైరెక్టర్ దర్శకత్వం

ఈ సినిమాలో హీరోగా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.
ఐదు భాషల్లో ది గర్ల్‌ఫ్రెండ్ రిలీజ్
ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్
ఈ నేపథ్యంలో తాజాగా అక్టోబర్ 25న ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఇలాంటి లవ్ స్టోరీని
హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ.. "ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది" అని అన్నారు.
ముఖ్యమని భావించా
"ఈ సినిమాలో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్‌తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మా మూవీ ట్రైలర్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నా. నేను చాలా మూవీస్ చేస్తున్నా గానీ ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి సినిమా చేయడం ముఖ్యమని భావించాను" అని రష్మిక మందన్నా చెప్పింది.
బాక్సాఫీస్ నెంబర్స్ కంటే
{{/usCountry}}"ఈ సినిమాలో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్‌తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మా మూవీ ట్రైలర్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నా. నేను చాలా మూవీస్ చేస్తున్నా గానీ ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి సినిమా చేయడం ముఖ్యమని భావించాను" అని రష్మిక మందన్నా చెప్పింది.
బాక్సాఫీస్ నెంబర్స్ కంటే
{{/usCountry}}"నాకు బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి మూవీ చేయాలి, మంచి కథను ఆడియెన్స్‌కు చెప్పాలనే అనిపిస్తుంది. నా మూవీ థియేటర్స్‌కు వెళ్లి చూసిన ఆడియెన్స్ ఏదో ఒక మంచి ఫీల్‌తో బయటకు వెళ్లాలని కోరుకుంటాను. నేను నా కెరీర్‌లో రైట్ టైమ్‌లో కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది" అని రష్మిక మందన్నా తెలిపింది.
మన డ్రీమ్స్ నిజం కావు
"ఇలాంటి మంచి టీమ్ లేకుంటే మన డ్రీమ్స్ నిజం కావు. దీక్షిత్ లాంటి కో స్టార్‌తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని తన స్పీచ్ ముగించిండి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.