...
...
Next Story

Rashmika Mandanna: రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రికార్డు.. 16 గంటల్లో 18 మిలియన్ల లైక్స్.. కియారా రికార్డ్ బ్రేక్

రష్మిక మందన్న తన పెళ్లి గురించి ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. కేవలం 16 గంటల్లోనే 18 మిలియన్లకుపైగా లైక్స్ తో ఆ పోస్ట్ కియారా అద్వానీ గతంలో క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేయడం విశేషం.

Published on: Feb 27, 2026, 14:06:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంట గురువారం (ఫిబ్రవరి 26) పెళ్లితో ఒక్కటవడం, ఆ పోస్టును రష్మిక షేర్ చేయడం, ఆ వెంటనే గంటల్లోనే ఇది రికార్డులు బ్రేక్ చేయడం చూస్తుంటే వీళ్ల పెళ్లికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కియారా రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

Rashmika Mandanna: రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రికార్డు.. 16 గంటల్లో 18 మిలియన్ల లైక్స్.. కియారా రికార్డ్ బ్రేక్
Rashmika Mandanna: రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రికార్డు.. 16 గంటల్లో 18 మిలియన్ల లైక్స్.. కియారా రికార్డ్ బ్రేక్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న తన పెళ్లి గురించి పెట్టిన పోస్ట్‌కు వచ్చిన స్పందన చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్ట్ షేర్ చేసిన కేవలం 16 గంటల్లోనే 18 మిలియన్లకుపైగా (కోటి 80 లక్షలు) లైకులను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ న్యూస్ రాసే సమయానికి 18.7 మిలియన్ల లైక్స్ రావడం విశేషం.

గతంలో నటి కియారా అద్వానీ వెడ్డింగ్ పోస్ట్‌కు వచ్చిన 15.8 మిలియన్ల లైకులే ఇప్పటివరకు అత్యధికం. ఇప్పుడు రష్మిక ఆ రికార్డును సునాయాసంగా అధిగమించి, తన గ్లోబల్ క్రేజ్‌ను మరోసారి నిరూపించుకుంది. అభిమానులు తమ అభిమాన జంటపై కామెంట్ల రూపంలో ప్రేమను కురిపిస్తూ సోషల్ మీడియాను ఒక వర్చువల్ సెలబ్రేషన్‌గా మార్చేశారు.

ప్రధానికి రిసెప్షన్ ఆహ్వానం

మరోవైపు ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్న విజయ్, రష్మిక దంపతులు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న తమ పెళ్లి రిసెప్షన్‌కు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. ఈ కపుల్ తమ పెళ్లి వేడుకల సందడి ఇంకా తగ్గకముందే ఢిల్లీలో ప్రత్యక్షమైంది.

వచ్చే వారం హైదరాబాద్ లో సినీ ప్రముఖులతోపాటు తమ సన్నిహితులకు విజయ్, రష్మిక జోడీ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

త్వరలోనే షూటింగ్స్‌లో బిజీ..

ప్రస్తుతం ఈ 'రణబాలి' స్టార్స్ పెళ్లి తర్వాత జరగాల్సిన సంప్రదాయబద్ధమైన క్రతువుల్లో మునిగిపోయారు. కొద్దిరోజుల పాటు ఈ మధుర క్షణాలను ఆస్వాదించాక, వచ్చే నెల నుంచి మళ్లీ తమ సినిమా షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. విజయ్ రణబాలితోపాటు మైసా అనే మరో సినిమాలోనూ రష్మిక నటిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe