Irumudi OTT: ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. థియేటర్లలో అదరగొట్టిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించిన ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
రూ.200 కోట్ల ఇరుముడి

'మజిలీ', 'నిన్ను కోరి' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి థియేటర్లలో విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన పబ్లిక్ టాక్‌తో దూసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది.
రవితేజ యాక్టింగ్
బాక్సాఫీస్ వద్ద పోటీగా ఇతర సినిమాలు ఉన్నప్పటికీ 'ఇరుముడి' సుదీర్ఘ కాలం పాటు థియేటర్లలో స్థిరమైన వసూళ్లను రాబట్టింది. రవితేజ అనగానే కేవలం మాస్, కామెడీ చిత్రాలే అనుకునే సమయంలో.. శివ నిర్వాణ ఆయనలోని పవర్‌ఫుల్ ఎమోషనల్ నటుడిని బయటకు తీశారు.
ముఖ్యంగా కుటుంబ బంధాలు, తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన కథాంశం సాధారణ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడమే రూ.200 కోట్ల గ్రాస్ సాధించడానికి కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిష్ రాజీ లేని నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇరుముడి ఓటీిటీ
తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ సంస్థ ఇరుముడి సినిమాను సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నెట్ఫ్లిక్స్ నుంచి త్వరలోనే వెలువడనుంది. థియేటర్లలో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్, ఓటీటీ ప్రియులు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓటీటీలోనూ రికార్డు!
{{/usCountry}}తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ సంస్థ ఇరుముడి సినిమాను సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నెట్ఫ్లిక్స్ నుంచి త్వరలోనే వెలువడనుంది. థియేటర్లలో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్, ఓటీటీ ప్రియులు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓటీటీలోనూ రికార్డు!
{{/usCountry}}ఇరుముడి సినిమాలో రవితేజ నటనకు తోడుగా బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, రమేష్ ఇందిర, స్వస్తిక విజయ్ తమ పాత్రల్లో జీవించారు. బేబీ నక్షత్ర, రవితేజ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
క్రాక్, ధమాకా తర్వాత రవితేజ ఖాతాలో చేరిన ఈ భారీ బ్లాక్‌బస్టర్ ఓటీటీలోనూ అదే రీతిలో వ్యూయర్ షిప్ రికార్డులను సృష్టిస్తుందనే అంచనాలున్నాయి.