...
...
Next Story

Rayudu Gari Taluka Review: రాయుడు గారి తాలూకా రివ్యూ- ఊరిలో వయసుకొచ్చిన యువకుల చావులు- యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Rayudu Gari Taluka Movie Review In Telugu: తెలుగులో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాయుడి గారి తాలూకా. ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్‌గా సత్య ఈషా చేసింది. సీనియర్ హీరో సుమన్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఎలా ఉందో నేటి రాయుడు గారి తాలూకా రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Mar 8, 2026, 10:20:42 IST
Advertisement

టాలీవుడ్‌లో రీసెంట్‌గా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా రాయుడు గారి తాలూకా. ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించిన రెండో సినిమా ఇది. ఈ మూవీలో ఉలిశెట్టి శ్రీనివాస్‌కు హీరోయిన్‌గా సత్య ఈషా నటించింది. అలాగే, సీనియర్ హీరో సుమన్ కీలక పాత్ర పోషించారు.

రాయుడు గారి తాలూకా రివ్యూ- ఊరిలో వయసుకొచ్చిన యువకుల చావులు- యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
రాయుడు గారి తాలూకా రివ్యూ- ఊరిలో వయసుకొచ్చిన యువకుల చావులు- యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

వీరితోపాటు కిట్టయ్య, ఆర్కే నాయుడు, ఉలిశెట్టి నాగరాజు, కరణం శ్రీహరి, సృజనక్షిత ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రచయిత, నిర్మాతగా హీరో ఉలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి రాయుడు గారి తాలూకా రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఓ గ్రామానికి రాయుడు (ఉలిశెట్టి శ్రీనివాస్) పెద్దగా ఉంటాడు. రాయుడు అంటే చాలా మందికి భయం, మరికొంతమందికి గౌరవం. కానీ, రాయుడు జీవితంలో రహస్యమైన కోణం ఉంటుంది. కూతురు అంటే రాయుడుకు ఎంతో ప్రాణం. కూతురును పట్టణంలో చదివిస్తుంటాడు రాయుడు.

అదే సమయంలో ఊరి చుట్టుపక్కల ప్రాంతాల్లో వయసుకు వచ్చిన అబ్బాయిలు చనిపోతుంటారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలో రాయుడికి కొన్ని నిజాలు బయటపడతాయి.

ట్విస్టులు

ఆ నిజాలు ఏంటీ? గ్రామాల్లో యువకులు ఎందుకు చనిపోతున్నారు? చీకటి గదిలో రాయుడు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాయుడు కూతురుకు ఏం జరిగింది? వంటి విషయాలు తెలియాలంటే ఈ రాయుడు గారి తాలూకా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఫస్టాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ బాగుంటుంది. ఆ తరువాత కథ నెమ్మదిగా సాగుతుంది. మళ్లీ విరామంతో ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ బాగా ఎంగేజ్ చేసేలా ఉంటుంది. అలాగే, మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషన్‌తో నిండిపోతాయి. రాయుడు కూతురు చనిపోయే పాట అందరి హృదయాలు తాకేలా ఉందని చెప్పొచ్చు.

ఆకట్టుకునే క్లైమాక్స్

యాక్షన్ సీక్వెన్స్‌పై ఇంకాస్తా ఫోకస్ పెట్టి ఉండాల్సింది. పాటలు బాగున్నా.. చిత్రీకరపై దృష్టి పెట్టాల్సింది. క్లైమాక్స్ బాగుంటుంది. రాయుడు పాత్రలో ఉలిశెట్టి శ్రీనివాస్ జీవించేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నట విశ్వరూపం చూపించారు. రెండు రకాలు పాత్రల్లో చాలా బాగా కనిపించారు.

శ్రీనివాస్ నటనలో పరిణితి కనిపిస్తుంది. ఒక కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ సినిమాకి ఆయన పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్‌గా సత్య ఈషా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. రెండు పాత్రలో చక్కగా ఇమిడింది అనే చెప్పాలి. కూతురుగా చేసిన అమ్మాయి అద్భుతంగా నటించింది. క్లైమాక్స్‌లో తన నటనతో ఆకట్టుకుంది .

ఫైనల్‌గా చెప్పాలంటే

మిగతా నటి నటీమణులు అందరూ చాలా బాగా చేశారు. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ పర్వాలేదు. అందరినీ కలుపుకుంటూ కథని ముందుకు తీసుకెళ్లిన డైరెక్టర్ టేకింగ్ బాగుంది. కొత్త వాళ్లతో కూడా సినిమా బాగా తీయొచ్చని నిరూపించారు. ఫైనల్‌గా చెప్పాలంటే కొన్ని చోట్ల నెమ్మదిగా సాగిన ఈ రాయుడు అలరిస్తాడు.

రేటింగ్ 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe