RCB vs SRH IPL 2026: ఇషాన్ కిషన్ ఊచకోత- పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన సాల్ట్- ఆర్సీబీపై ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు!
SRH Score IPL 2026: ఐపీఎల్ కొత్త సీజన్ తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో అనికేత్ వర్మ విధ్వంసం సృష్టించాడు. సాల్ట్ పక్షిలా ఎగిరి పట్టిన క్యాచ్ హైలెట్‌గా నిలిచింది.
ఐపీఎల్ 2026 సరికొత్త సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు సన్‌రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కిషన్ గర్జన
సన్‌రైజర్స్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్.. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 38 బంతుల్లోనే 13 బౌండరీలతో 80 పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కిషన్ ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాడు.
అయితే 16వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కిషన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫిలిప్ సాల్ట్ అచ్చం పక్షిలా ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ పట్టి ఇషాన్ కిషన్ పెవిలియన్‌కు చేరేలా చేశాడు. ఫిలిప్ సాల్ట్ పట్టిన క్యాచ్‌ను కామెంటేటర్స్ తెగ పొగిడేశారు. ఈ క్రమంలోనే ఆ క్యాచ్‌ను పక్షిలా ఎగిరి పట్టినట్లుగా అభివర్ణించారు.
చివర్లో అనికేత్ వర్మ మెరుపులు
ఇషాన్ కిషన్ అవుటయ్యాక స్కోరు తగ్గుతుందేమో అనుకున్న తరుణంలో అనికేత్ వర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 బౌండరీలతో 43 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన డేవిడ్ పేన్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అరంగేట్రం మ్యాచ్‌లోనే డఫీ మ్యాజిక్
బెంగళూరు బౌలర్లలో ఐపీఎల్ అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ ఆకట్టుకున్నాడు. తన మొదటి మూడు ఓవర్లలోనే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి కీలక వికెట్లను తీసి హైదరాబాద్‌ను దెబ్బతీశాడు. మొత్తం 4 ఓవర్లలో కేవలం 22 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ షెపర్డ్ కూడా 3 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఫీల్డింగ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు అదరగొట్టారు. ఇంపాక్ట్ సబ్ కింద వచ్చిన దేవదత్ పడిక్కల్ మూడు క్యాచ్‌లతో మెరిస్తే, ఫిలిప్ సాల్ట్ ఒక అద్భుతమైన ఒంటిచేతి క్యాచ్‌తో కిషన్‌ను పెవిలియన్‌కు పంపాడు. మరి 201 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు ఛేదిస్తుందో లేదో చూడాలి!
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


