...
...
Next Story

Release Date: సినిమాలకి ఏమైంది.. రిలీజ్ డేట్ చూసుకోరా? ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారా? మూవీ వాయిదాలపై సినీ లవర్స్ ఫైర్

Release Date: శుక్రవారం వస్తుందంటే చాలు కొత్త సినిమాలు థియేటర్లకు ఏం వస్తున్నాయని చూసే మూవీ లవర్స్ ఎంతో మంది. ఇక పర్టిక్యులర్ హీరో ఫ్యాన్స్ సంగతి చెప్పక్కర్లేదు. కానీ ఇటీవల సినిమాల రిలీజ్ డేట్ లను మారుస్తున్న మేకర్స్.. ఇలాంటి సినీ లవర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Published on: Oct 6, 2026, 05:56:45 IST
Advertisement

Release Date: రిలీజ్ కు సమయం దగ్గరపడ్డ తర్వాత లేదా థియేటర్లకు మూవీ రావడానికి మూడు రోజుల ముందు సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పడం నయా ట్రెండ్ గా మారినట్లే కనిపిస్తోంది. తాజాగా ఆదర్శ కుటుంబం విషయంలోనూ ఇదే జరగడంతో మేకర్స్ తీరుపై సినీ లవర్స్ మండిపడుతున్నారు.

ఆదర్శ కుటుంబం పోస్ట్ పోన్

సినిమాలకి ఏమైంది.. రిలీజ్ డేట్ చూసుకోరా? ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారా? మూవీ వాయిదాలపై సినీ లవర్స్ ఫైర్ (x/haarikahassine)
సినిమాలకి ఏమైంది.. రిలీజ్ డేట్ చూసుకోరా? ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారా? మూవీ వాయిదాలపై సినీ లవర్స్ ఫైర్ (x/haarikahassine)

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47' (AK47) చిత్రం అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో మళ్లీ వాయిదా పడింది. ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, సినిమా ఇంకా పూర్తి కాలేదని, ప్లానింగ్ లోపం, పరిశ్రమలో క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమ్మర్ లోనే రిలీజ్

ఆదర్శ కుటుంబం మూవీ ఎప్పుడో ఏడాది క్రితం మొదలైంది. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో భారీగా ఎఫర్ట్స్ పెట్టి తీయాల్సిన యాక్షన్ సీన్స్ కానీ, వీఎఫ్ఎక్స్ వర్క్స్ కానీ లేవు. నిజానికి ఈ సినిమాను 2026 సమ్మర్ లో రిలీజ్ చేస్తామన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2 అన్నారు. మళ్లీ అక్టోబర్ 9కి మార్చారు. ఇప్పుడు అసలు కొత్త డేట్ ఎప్పుడో కూడా చెప్పలేదు.

ఇంకా సాంగ్స్ పెండింగ్

రీసెంట్ గా నాగవంశీ చెప్పిన మాటల ప్రకారం ఆదర్శ కుటుంబం మూవీకి సంబంధించి ఇంకా రెండు పాటలు షూటింగ్ చేయాల్సి ఉంది. మరి ఇవి పెండింగ్ లో ఉండగానే అక్టోబర్ 9న సినిమాను కచ్చితంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎందుకు నమ్మకంగా చెప్పారని ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు.

సినిమా రిలీజ్ డేట్ లను మార్చడం ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. ఈ ఏడాది పెద్ది నుంచి మొదలు పెడితే లెనిన్, టాక్సిక్, ది ప్యారడైజ్.. ఇలా భారీ సినిమాలకు ముందు ఒక డేట్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఇంకో డేట్ కు మూవీ రిలీజ్ చేశారు. అసలు పక్కా ప్లానింగ్ లేకుండా మేకర్స్ ముందుగానే ఎందుకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.

అనిల్ రావిపూడి ఇలా

మరోవైపు తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడిని చూసి సినిమాల రిలీజ్ విషయం, ప్లానింగ్ లో ఇతర మేకర్స్ పాఠాలు నేర్చుకోవాలని నెట్టింట్ ట్రోల్స్ వస్తున్నాయి. అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ తో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేస్తారు. ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. అనుకున్న టైమ్ కు సినిమాను థియేటర్లకు తీసుకొస్తారు. మిగతా డైరెక్టర్లు కూడా ఇదే ప్లానింగ్ తో సాగాలని సినీ లవర్స్ కోరుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks