...
...
Next Story

Rishab Shetty Peddi: పెద్ది ట్రైలర్‌పై రిషబ్ శెట్టి రివ్యూ.. రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌కు కాంతార స్టార్ ఫిదా!

Rishab Shetty Peddi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' చిత్ర ట్రైలర్‌ చూసి కాంతార స్టార్ రిషబ్ శెట్టి ఫిదా అయ్యాడు. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతమని ట్వీట్ చేశాడు. మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

Published on: May 19, 2026 01:01 PM IST
Advertisement

Rishab Shetty Peddi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిట్టుకుంటున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ముంబై వేదికగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిన ఈ ట్రైలర్‌కు సామాన్య ప్రేక్షకుల నుంచే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా భారీ ప్రశంసలు దక్కుతున్నాయి.

రిషబ్ శెట్టి ప్రశంసలు

రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ కు రిషబ్ శెట్టి ఫిదా (x)
రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ కు రిషబ్ శెట్టి ఫిదా (x)

పెద్ది ట్రైలర్ కు ఫిదా అయిన సెలబ్రిటీల జాబితాలోకి కన్నడ స్టార్ డైరెక్టర్, నటుడు, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి కూడా చేరిపోయాడు. 'పెద్ది' ట్రైలర్ చూసిన ఆయన, చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. "పెద్ది ట్రైలర్ అద్భుతంగా ఉంది" అని రిషబ్ శెట్టి తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు.

అదిరిన లుక్

ప్రతి ఫ్రేమ్‌లో రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నిప్పులు చెరుగుతోందని రిషబ్ శెట్టి తన రివ్యూ ఇచ్చేశాడు. కన్నడ లెజెండరీ నటుడు శివ రాజ్‌కుమార్ ఈ సినిమాలో గౌరనాయుడు అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఉనికి సినిమాకు ఒక అద్భుతమైన గంభీరత్వాన్ని, సరికొత్త కోణాన్ని జోడించిందని రిషబ్ శెట్టి ప్రశంసించాడు.

ఇక కథానాయిక జాన్వీ కపూర్ గురించి ప్రస్తావిస్తూ.. ఆమె స్క్రీన్‌పై ఎంతో అందంగా, వైబ్రంట్‌గా కనిపిస్తూ సరికొత్త వెలుగును తీసుకువచ్చిందని రిషబ్ అభినందించాడు.

అద్భుతం

పెద్ది సినిమాలో రామ్ చరణ్ ఓ రూరల్ స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించనున్నాడు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్.. ఇలా మూడు డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడే ప్లేయర్ గా అలరించనున్నాడు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి క్రీడల నేపథ్యంలో 1980ల కాలం నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇప్పటికే 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రా రా' పాటలు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.

విజయనగరం నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ కథలో కేవలం ఆటలు మాత్రమే కాకుండా, ఊరి ప్రజల ఆత్మగౌరవం కోసం, వారిపై జరిగే అణచివేతకు వ్యతిరేకంగా హీరో చేసే పోరాటాన్ని ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'పెద్ది' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

జవాబు: రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రశ్న: ఈ చిత్రానికి దర్శకుడు, సంగీత దర్శకుడు ఎవరు?

జవాబు: 'ఉప్పెన' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాను తెరకెక్కించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ప్రశ్న: సినిమాలో శివ రాజ్‌కుమార్ పోషిస్తున్న పాత్ర ఏమిటి?

జవాబు: కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ చిత్రంలో 'గౌరనాయుడు' అనే కీలకమైన, గంభీరమైన పహిల్వాన్ గురువు పాత్రలో నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe