Raja Shivaji Get 100 Cr Collection After 10 Years In Marathi: భారతీయ చలనచిత్ర రంగంలో వంద కోట్ల వసూళ్లు సాధించడం అనేది ఒకప్పుడు కేవలం బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలకే సాధ్యమయ్యేది. కానీ ప్రాంతీయ సినిమాలు సైతం కంటెంట్ బాగుంటే రికార్డులను తిరగరాయగలవని మరాఠీ చిత్రసీమ మరోసారి నిరూపించింది.
థియేటర్లలో కాసుల వర్షం

మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'రాజా శివాజీ' చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. వంద కోట్ల మైలురాయిని దాటి మరాఠీ ఇండస్ట్రీ స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పింది.
గతంలో 2016లో నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వం వహించిన 'సైరాట్' చిత్రం మొదటిసారిగా రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. అంటే సరిగ్గా పదేళ్లకు ఆ రికార్డును రాజా శివాజీ బ్రేక్ చేయగలిగింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మరాఠీ సినిమా రంగానికి ఆ మైలురాయిని చేరడానికి శతాబ్దం పైగా సమయం పట్టిందన్నమాట.
ఆ తర్వాత గత పదేళ్లలో ఏ ఒక్క మరాఠీ సినిమా కూడా ఆ రికార్డు దరిదాపుల్లోకి రాలేకపోయింది. ఇప్పుడు రితేష్ దేశ్‌ముఖ్ ఆ రికార్డులను బద్దలు కొడుతూ మరాఠీ సినిమా సత్తాను చాటారు. మన తెలుగు ప్రేక్షకులకు 'బాహుబలి', 'రుద్రమదేవి' వంటి చారిత్రక సినిమాలు ఎంతటి గర్వకారణమో, మరాఠీ ప్రజలకు 'రాజా శివాజీ' అంతటి భావోద్వేగంగా మారింది.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ
మొదటి రోజు నుంచే భారీ అంచనాలతో బరిలోకి దిగిన 'రాజా శివాజీ' తొలి వారాంతంలోనే (ఫస్ట్ వీకెండ్) రూ. 30 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి శుభారంభం అందుకుంది. వర్కింగ్ డేస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ మొదటి వారం ముగిసేసరికి రూ. 52.65 కోట్లు, రెండో వారం నాటికి రూ. 77 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడో వారాంతంలో మరోసారి బాక్సాఫీస్ వద్ద పుంజుకుని రూ. 7.60 కోట్లు సాధించింది.
మొత్తంగా 17 రోజులు పూర్తి చేసుకునే సరికి ఈ చిత్రం దేశీయంగా రూ. 84.55 కోట్ల నెట్ వసూళ్లను (రూ. 100 కోట్ల గ్రాస్) సాధించింది. సాధారణంగా మరాఠీ సినిమాలకు ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ సినిమాను కూడా విదేశాల్లో విడుదల చేయలేదు.
{{/usCountry}}మొత్తంగా 17 రోజులు పూర్తి చేసుకునే సరికి ఈ చిత్రం దేశీయంగా రూ. 84.55 కోట్ల నెట్ వసూళ్లను (రూ. 100 కోట్ల గ్రాస్) సాధించింది. సాధారణంగా మరాఠీ సినిమాలకు ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ సినిమాను కూడా విదేశాల్లో విడుదల చేయలేదు.
{{/usCountry}}కేవలం దేశీయ మార్కెట్ కలెక్షన్స్‌తోనే వంద కోట్ల క్లబ్‌లో రాజా శివాజీ చేరడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఆదివారం (మే 17) ఒక్క రోజే ఈ సినిమా రూ. 4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
'సైరాట్' రికార్డుకు చేరువగా..
కుల వివక్షత నేపథ్యంలో వచ్చిన ప్రేమకథ చిత్రం 'సైరాట్' ఇప్పటివరకు రూ. 110 కోట్ల లైఫ్‌టైమ్ గ్రాస్ కలెక్షన్స్‌తో మరాఠీ చిత్రసీమలో టాప్ 1 ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం 'రాజా శివాజీ' నడుస్తున్న వేగాన్ని చూస్తుంటే నాలుగో వారంలోనే ఈ రికార్డును అధిగమించి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరాఠీలో ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలు (బాయిపన్ భారీ దేవా, వేద్, నటసామ్రాట్) మాత్రమే రూ. 50 కోట్ల మార్కును దాటాయి. ఇందులో 'వేద్' సినిమాలో కూడా రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించారు. దీనిబట్టి టాప్-5 మరాఠీ చిత్రాలలో రెండు సినిమాలు రితేష్ ఖాతాలోనే ఉండటం విశేషం.
భారీ తారాగణం.. జెనీలియా నిర్మాణం
ఈ ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రానికి రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా కథను అందించి దర్శకత్వం వహించారు. ముంబై ఫిల్మ్ కంపెనీ, జియో స్టూడియోస్ బ్యానర్లపై రితేష్ భార్య, హీరోయిన్ జెనీలియా డిసౌజా, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
సల్మాన్ ఖాన్ కెమియో
ఈ చిత్రంలో రితేష్, జెనీలియాతో పాటు బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో మెరిశారు. అలాగే మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. సల్మాన్ ఖాన్ కెమియో కూడా ఉంది. నటీనటుల అద్భుత నటన, అద్భుతమైన నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని ఇంతటి ఘన విజయానికి చేర్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.