...
...
Next Story

Rohit Sharma OTT Show: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మ.. బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ డెబ్యూ అంటూ ప్రోమో రిలీజ్

Rohit Sharma OTT Show: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు. సోనీ టీవీ, సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం కానున్న తన కొత్త షో టీజర్ తో అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. ఆ విశేషాలు మీకోసం.

Published on: May 8, 2026, 21:38:46 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Rohit Sharma OTT Show: మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ.. ఇప్పుడు బుల్లితెరపై వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ త్వరలోనే టీవీ, ఓటీటీ డెబ్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన క్రేజీ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rohit Sharma OTT Show: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మ.. బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ డెబ్యూ అంటూ ప్రోమో రిలీజ్
Rohit Sharma OTT Show: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మ.. బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ డెబ్యూ అంటూ ప్రోమో రిలీజ్

రోహిత్ శర్మ కేవలం ఆటతోనే కాదు, తనదైన శైలిలో సరదాగా మాట్లాడే మాటలతోనూ నెటిజన్లను అలరిస్తుంటారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఆయనలోని కామెడీ యాంగిల్‌ను పూర్తిస్థాయిలో చూడబోతున్నామని అర్థమవుతోంది.

గార్డెన్ డైలాగ్‌తో కష్టాలు

సోనీ లివ్ ఓటీటీ విడుదల చేసిన ఈ ప్రోమోలో రోహిత్ శర్మ చుట్టూ అభిమానులు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడుతుంటారు. అయితే వారంతా ఆటోగ్రాఫ్ తీసుకుంటూనే రోహిత్ గతంలో వైరల్ చేసిన "గార్డెన్‌లో ఎవరూ తిరగకూడదు" (గార్డెన్ మే కోయి నహీ ఘూమేగా) అనే డైలాగ్ చెప్పమని కోరుతుంటారు.

ప్రతి ఒక్కరూ అదే అడగడంతో రోహిత్ అసహనానికి గురై, ఫోన్ చేసి "గార్డెన్ పని ఆపేయండి, నాకు అసలు జీవితంలో గార్డెనే వద్దు" అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతారు.

ఎంటర్‌టైన్‌మెంట్ కే బాప్

"రెండు లైన్లు మాట్లాడితేనే ఇంత వైరల్ అయ్యింది.. ఇక నా పూర్తి షో వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అంటూ రోహిత్ ఈ టీజర్‌లో సవాల్ విసిరారు. "చాలు ఇక గార్డెన్ ముచ్చట్లు.. ఇప్పుడు ఏదైనా కొత్తగా చేద్దాం" అనే క్యాప్షన్ తో ఆయన ఈ వీడియోను షేర్ చేశారు.

రోహిత్ శర్మ టీవీ ఎంట్రీపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. "హిట్ మ్యాన్ షో సూపర్ హిట్ అవ్వడం ఖాయం" అని కొందరు అంటుంటే.. మరికొందరు "ఇదేమైనా రిటైర్మెంట్ ప్లానా భాయ్?" అంటూ సరదాగా ఆటపట్టిస్తున్నారు.

ముంబై ఇండియన్స్ అభిమానులు మాత్రం "కెప్టెన్సీ మళ్ళీ తీసుకో రోహిత్, మేనేజ్‌మెంట్‌ను క్షమించి మాకు మరో ట్రోఫీ అందించు" అని కోరుతున్నారు. ఏదేమైనా 46 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న రోహిత్ శర్మ బుల్లితెర ఎంట్రీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ షో త్వరలోనే రాబోతోందని సోనీ లివ్ ఓటీటీ తన ప్రోమోలో వెల్లడించింది. అది అది ఎప్పుడు, అసలు ఆ షో ఏంటి అన్న వివరాలను త్వరలోనే ఆ ఓటీటీ వెల్లడించే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ క్రికెట్ ఫీల్డ్ లో అలరించిన రోహిత్.. ఇక నుంచి ఓటీటీ, టీవీలోనూ తన మార్క్ కామెడీ టైమింగ్ తో నవ్వించబోతున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe