Tamil Thriller OTT: ఓటీటీ ప్రియుల కోసం ఆహా వీడియో ఎప్పటికప్పుడు విభిన్నమైన కంటెంట్ ను అందిస్తూనే ఉంది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా, ఇతర భాషల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇవాళ (నవంబర్ 12) తమిళంలో రూపొందిన ఓ క్రేజీ డ్రామా అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'సాయవనం' డిజిటల్ ప్రీమియర్ గా ఆహాలోకి వచ్చేసింది.
సాయవనం స్టోరీ

'సాయవనం' సినిమా కథ అంతా దట్టమైన అడవి నేపథ్యంలో.. ఒంటరితనం, నమ్మకద్రోహం, మనుషుల మధ్య జరిగే ఎమోషనల్ సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో 'సీత' అనే మహిళదే ప్రధాన పాత్ర. ముత్తు అనే వ్యక్తి లారీ కొనేందుకు వెళ్లి మూడేళ్ల పాటు కనిపించకుండా పోతాడు. దీంతో సీత ఒంటరిగా మిగిలిపోతుంది.
సీత పోరాటం
ఆ సమయంలో సురుళి అనే వ్యక్తి ఆమెకు దగ్గరవుతాడు. అయితే అనుకోకుండా కొన్నాళ్ల తర్వాత ముత్తు తిరిగి రావడం, ఆ తర్వాత దొంగిలించిన డబ్బు, నమ్మకద్రోహం, పగ.. ఇలా అనూహ్య మలుపులతో సాయవనం సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మోసపోయిన ఓ మహిళ తనకంటూ ఓ ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం, తన బాధను శక్తిగా, నిశ్శబ్దాన్ని బలంగా ఎలా మార్చుకుంది అనేది ఈ సాయవనం మూవీలో చాలా సహజంగా చూపించారు.
అడవిలో భయం
సాయవనం సినిమాలో సీత పాత్రలో దేవనంద షాజిలాల్ (Devananda Shajilal) అద్భుతమైన నటన కనబరిచారు. ముత్తుగా సౌందర రాజా, సురుళిగా సంతోష్ దామోదరన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అప్పుకుట్టి, జానకి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రామచంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు.
అడవి అందాలను, అక్కడ ఉండే భయానక వాతావరణాన్ని కెమెరాలో అద్భుతంగా బంధించారు. పోలి వర్గీస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సైకలాజికల్, సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలోని సస్పెన్స్ ను మరింత పెంచుతుంది.
తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్
{{/usCountry}}అడవి అందాలను, అక్కడ ఉండే భయానక వాతావరణాన్ని కెమెరాలో అద్భుతంగా బంధించారు. పోలి వర్గీస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సైకలాజికల్, సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలోని సస్పెన్స్ ను మరింత పెంచుతుంది.
తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్
{{/usCountry}}సైకలాజికల్ థ్రిల్లర్, డ్రామా జానర్ లో తెరకెక్కిన సాయవనం సినిమాను ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆహా వీడియోలో (Aha Video) ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా ఒకేసారి అటు తమిళంతో పాటు ఇటు తెలుగు డబ్బింగ్ వర్షన్ లో కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.
ఎందుకు చూడాలంటే?
అసలు అడవిలో ఏం జరిగింది? సైకలాజికల్ గా మనుషుల వ్యక్తిత్వం ఎలా మారిందనేది ఈ సాయవనం సినిమాలో గొప్పగా చూపించారు. మనుషుల మధ్య ఉండే బంధాలు, పరిస్థితులు వారిని ఎలా మార్చేస్తాయి అనే అంశాలను మేకర్స్ చాలా నేచురల్ గా ప్రెజెంట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే 'సాయవనం' మూవీని ఆహాలో చూసేయండి.