...
...
Next Story

Saif Ali Khan: బాలీవుడ్‌లో లింగ వివ‌క్ష‌పై దేవర విలన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు-అమ్మాయిలకు త‌క్కువ రెమ్యున‌రేష‌న్ ఎందుకన్న సైఫ్

Saif Ali Khan: బాలీవుడ్ లో ఎప్పటి నుంచో డిస్కషన్ టాపిక్ గా ఉన్న లింగ వివక్షపై సైఫ్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమ్మాయిలు అనే కారణంతో మహిళా ఆర్టిస్టులకు తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఈ దేవర విలన్ అన్నాడు.

Published on: Mar 9, 2026, 15:00:24 IST
Advertisement

బాలీవుడ్ పాపులర్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో లింగ వివక్ష, ఈక్వెల్ రెమ్యునరేషన్ పై అతను చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అమ్మాయిలు అనే కారణంతో మహిళా ఆర్టిస్టులకు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఈ దేవర విలన్ ఖండించాడు.

సైఫ్ అలీ ఖాన్ కామెంట్లు

సైఫ్ అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్ కామెంట్లు వైరల్ గా మారాయి. సినిమా పరిశ్రమలో వేతన సమానత్వంపై తన కామెంట్లతో మరో చర్చకు తెరతీశాడు. ఇటీవల తన సోదరి సోహా అలీ ఖాన్ హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడాడు. బాలీవుడ్‌లో లింగ వేతన వ్యత్యాసంపై చాలా కాలంగా జరుగుతున్న చర్చను నటుడు ప్రస్తావించాడు. అందరికీ రెమ్యునరేషన్ పరంగా న్యాయంగా వ్యవహరించాలని సైఫ్ అన్నాడు.

బాక్సాఫీస్ లెక్కలతో

బాలీవుడ్‌లో ఈక్వెల్ రెమ్యునరేషన్ పై సైఫ్ అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. తన సిస్టర్ సోహా అలీ ఖాన్, ఆమె భర్త కునాల్ ఖేముతో కలిసి హోస్ట్ చేసిన పాడ్ కాస్ట్ లో సైఫ్ పాల్గొన్నాడు. సమాన స్థాయి కలిగిన నటులు ఒకే రెమ్యునరేషన్ పొందాలని తాను భావిస్తున్నట్లు సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. అయితే సినిమా బిజినెస్ లో వ్యవహారం మొత్తం బాక్సాఫీస్ లెక్కలతో ముడిపడి ఉంటుందని సైఫ్ అన్నాడు.

థియేటర్లో ఆడియన్స్

‘‘ఒకే రేంజ్ లో ఉన్న నటులకు ఒకే రకమైన రెమ్యునరేషన్ ఇవ్వాలి. అయితే ఇందులో బిజినెస్ లెక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. మీరు థియేటర్లలో ఆడియన్స్ నింపగలిగే దాన్ని బట్టి రెమ్యునరేషన్ లెక్కలు ఆధారపడి ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారు’’ అని సైఫ్ పేర్కొన్నాడు.

అమ్మాయి అని కాదు

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సైఫ్ అడుగుపెట్టాడు. ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. దేవర మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks