...
...
Next Story

Aneet Padda Emotional: యంగ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం- అత్యంత ఇష్టపడే వ్యక్తిని కోల్పోయిన అనీత్ పడ్డా- ఎమోషనల్ పోస్ట్

Aneet Padda Grandfather Died Actress Emotional: తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న అనీత్ పడ్డా తాతయ్య కన్నుమూశారు. అనీత్ పడ్డా భావోద్వేగపూరిత పోస్ట్ నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.

Published on: Apr 21, 2026, 10:21:02 IST
Advertisement

Aneet Padda Emotional Note On Grandfather Death: బాలీవుడ్‌లో 'సయ్యారా' సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన హీరోయిన్ అనీత్ పడ్డా తన జీవితంలో అత్యంత ఇష్టపడే వ్యక్తిని కోల్పోయారు. అనీత్ పడ్డా తాతయ్య అల్జీమర్స్ వ్యాధితో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన తాతయ్య చేతిని పట్టుకున్న ఫోటోను పంచుకుంటూ, ఒక సుదీర్ఘమైన లేఖను రాశారు అనీత్ పడ్డా.

ఏకైక నిజమైన ప్రేమ మీరే

యంగ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం- అత్యంత ఇష్టపడే వ్యక్తిని కోల్పోయిన అనీత్ పడ్డా- ఎమోషనల్ పోస్ట్
యంగ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం- అత్యంత ఇష్టపడే వ్యక్తిని కోల్పోయిన అనీత్ పడ్డా- ఎమోషనల్ పోస్ట్

"నా జీవితంలో నేను పొందిన ఏకైక నిజమైన ప్రేమ మీరే. మీరు జ్ఞాపకాలను కోల్పోయినా.. మీ మనవరాలిని (మాఖన్) మాత్రం మర్చిపోలేదు" అంటూ అనీత్ పడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జ్ఞాపకాలను, ఆయన చెప్పిన జోకులను, ఆయనలోని దయా గుణాన్ని తన జీవితాంతం గుర్తు ఉంచుకుంటూ ముందుకు వెళ్తానని యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా పేర్కొన్నారు.

"ఈరోజు ఆకాశంలో ప్రకాశవంతంగా మెరుస్తున్న నక్షత్రాన్ని చూశాను.. మీరు ఎక్కడికి వెళ్లారో నాకు అర్థమైంది దాదూ. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను" అని ఆమె రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.

వెండితెర పాత్రకు.. నిజ జీవితానికి ఉన్న బంధం

అనీత్ పడ్డా కెరీర్‌ను మలుపు తిప్పిన 'సయ్యారా' సినిమాలో ఆమె అల్జీమర్స్ వ్యాధితో బాధపడే యువతిగా నటించారు. నిజానికి ఆ పాత్రలో అంత సహజంగా నటించడానికి తన తాతయ్యే స్ఫూర్తి అని ఆమె గతంలోనే వెల్లడించారు.

తన తాతయ్య కూడా అల్జీమర్స్‌తో పోరాడుతున్నారని, ఆయన తన పేరు మర్చిపోయినా ప్రేమగా 'హీరాపుత్' లేదా 'మాఖన్' అని పిలిచేవారని అనీత్ పడ్డా గుర్తు చేసుకున్నారు. "మెదడు మర్చిపోయినా.. గుండె మర్చిపోదు" అనే మాట తన తాతయ్య విషయంలో అక్షర సత్యమని అనీత్ పడ్డా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ప్రయాణం

దాదాపు రూ. 580 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ చిత్రంగా సయ్యారా రికార్డు సృష్టించింది. కాగా ప్రస్తుతం అనీత్ పడ్డా మ్యాడక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'శక్తి శాలిని' అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు.

తాత మరణం తీరని లోటు

అలాగే అహాన్ పాండేతో కలిసి మరో భారీ ప్రేమకథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంతటి విజయాల సమయంలో తనకు అండగా నిలిచిన తాతయ్యను కోల్పోవడం అనీత్ పడ్డాకు తీరని లోటని చెప్పవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అనీత్ పడ్డా తాతయ్య ఏ వ్యాధితో మరణించారు?

ఆయన గత కొంతకాలంగా అల్జీమర్స్ (జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యాధి)తో బాధపడుతూ కన్నుమూశారు.

2. అనీత్ పడ్డా నటించిన 'సయ్యారా' సినిమా సాధించిన వసూళ్లు ఎంత?

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 580 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అత్యంత విజయవంతమైన రొమాంటిక్ చిత్రంగా నిలిచింది.

3. అనీత్ పడ్డా రాబోయే సినిమాలు ఏవి?

ఆమె ప్రస్తుతం 'శక్తి శాలిని' అనే హారర్ కామెడీతో పాటు, యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో ఒక భారీ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe