సైయారా.. 2025లో థియేటర్లలో రిలీజైన ఈ హిందీ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది చూశాం. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ఇదే. అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు మరోసారి వాలెంటైన్స్ వీక్ సందర్భంగా సైలెంట్ గా థియేటర్లో రీ రిలీజ్ అయింది ఈ మూవీ.
సైయారా రీ రిలీజ్

రొమాంటిక్ బ్లాక్ బస్టర్ మూవీ సైయారా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లో రీ రిలీజ్ అయింది. ఈ మూవీ రీ రిలీజ్ గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ బుక్ మై షోలో మాత్రం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు (ఫిబ్రవరి 7) ఉదయం నుంచే సైయారా షోలు ఇందులో చూపిస్తున్నాయి.
ఈ థియేటర్లలో
వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే నగరాల్లోని థియేటర్లలో సైయారా రీ రిలీజైంది. గత ఏడాది జులైలో థియేటర్లలో విడుదలైన సైయారా ఒక సంచలనంగా మారింది. ఈ రొమాంటిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ.577 కోట్లు వసూలు చేసి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో రెండవ స్థానంలో నిలిచింది.
అంతేకాకుండా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ చిత్రంగా నిలిచింది. ఇందులో అహాన్ పాండే హీరో, అనీత్ పడ్డా హీరోయిన్. హీరోయిన్ అనన్య పాండే బ్రదర్ అహాన్ కు ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం.
సైయారా స్టోరీ
లవ్ అండ్ రొమాంటిక్ మూవీ సైయారా ఓ మ్యూజీషియన్, జర్నలిస్ట్ కమ్ రైటర్ మధ్య లవ్ స్టోరీ గురించి సాగుతోంది. సంగీతకారుడు కృష్ణగా అహాన్ పాండే, జర్నలిస్ట్ అండ్ కవయిత్రి వాణి బాత్రాగా అనీత్ పడ్డా నటించారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సానుకూల సమీక్షలను అందుకుంది, ముఖ్యంగా నటీనటుల కెమిస్ట్రీకి ప్రశంసలు దక్కాయి.
ఓటీటీలో
{{/usCountry}}లవ్ అండ్ రొమాంటిక్ మూవీ సైయారా ఓ మ్యూజీషియన్, జర్నలిస్ట్ కమ్ రైటర్ మధ్య లవ్ స్టోరీ గురించి సాగుతోంది. సంగీతకారుడు కృష్ణగా అహాన్ పాండే, జర్నలిస్ట్ అండ్ కవయిత్రి వాణి బాత్రాగా అనీత్ పడ్డా నటించారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సానుకూల సమీక్షలను అందుకుంది, ముఖ్యంగా నటీనటుల కెమిస్ట్రీకి ప్రశంసలు దక్కాయి.
ఓటీటీలో
{{/usCountry}}సైయారా మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ సినిమా అదరగొట్టింది. స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత కొన్ని వారాల పాటు నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అయింది. ఇప్పుడు థియేటర్లలో మరోసారి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. వాలైంటైన్స్ వీక్ సందర్భంగా స్పెషల్ గా ఈ సినిమా ప్రీమియర్ అవుతోంది.