...
...
Next Story

Samanth Birthday: స‌మంత బ‌ర్త్‌డే.. పార్ట్ టైమ్ జాబ్ నుంచి వంద కోట్ల దాకా.. సామ్ నెట్ వ‌ర్త్ తెలిస్తే షాక్ అవాల్సిందే!

Samanth Birthday: ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన సమంత రూత్ ప్రభు బర్త్ డే ఈ రోజు. గతంలో పార్ట్ టైమ్ జాబ్ చేసిన సామ్.. ఇప్పుడు వంద కోట్ల నెట్ వర్త్ కలిగిన హీరోయిన్. ఆమె నెట్ వర్త్ గురించి పూర్తి వివరాలు చూసేయండి.

Published on: Apr 28, 2026, 10:54:57 IST
Advertisement

Samanth Birthday: జీవితంలో ఎన్ని సమస్యలైనా రావొచ్చు, కానీ పట్టుదలతో ముందుకు సాగితే సక్సెస్ కావొచ్చని చాటే సమంత రూత్ ప్రభు లైఫ్ అందరికీ స్ఫూర్తి కలిగించేదే. ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ బర్త్ డే ఈ రోజు (ఏప్రిల్ 28). ఒకప్పుడు పార్ట్ టైమ్ జాబ్ చేసిన సమంత.. ఇప్పుడు వంద కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఆమె నెట్ వర్త్ పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.

సమంత బర్త్ డే

సమంత (instagram-Samantha)
సమంత (instagram-Samantha)

సమంత బర్త్ డే సందర్భంగా ఒక్కసారి ఆమె కెరీర్ చూస్తే ఎన్నో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. ఆమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. అందుకే తను చదువుకునే రోజుల్లో ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేసేది. ఆ తర్వాత మోడలింగ్ వైపు రావడంతో ఆమె కెరీర్ టర్న్ అయింది.

టాప్ హీరోయిన్

‘ఏ మాయ చేశావే’ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సమంత.. సౌత్ ఇండియాలో టాప్ లోకి దూసుకెళ్లింది. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకుంది. ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘జనతా గ్యారేజీ’, ‘రంగస్థలం’, ‘ఓ బేబీ’ లాంటి సినిమాలతో సమంత పేరు మార్మోగింది.

వంద కోట్లు

సమంత నెట్ వర్త్ సుమారు రూ.100 కోట్లు అని అంచనా. ఒక్కో సినిమాకు ఆమె రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. సినిమాలు, ప్రకటనల ద్వారా సామ్ ఎక్కువగా సంపాదిస్తోంది. మింత్రా, మామా ఎర్త్, పెప్సీ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సమంత ప్రచారకర్తగా ఉంది. ఒక్కో యాడ్ కోసం ఆమె రూ.1 కోటి తీసుకుంటుందని తెలిసింది.

సమంత ఆస్తులు

సమంత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె 2025 డిసెంబర్ లో ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకుంది. అంతకంటే ముందు నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సామ్.. అతని నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేసింది. ఇది మే 15న రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe