...
...
Next Story

ఇకనుంచి నేను అతని సమస్య.. రెండో పెళ్లి తర్వాత డెవిల్ ఎమోజీతో సమంత పోస్ట్.. ఎవరి గురించి అంటే?

సమంత రూత్ ప్రభు తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో రెండో పెళ్లి ఫొటోలను పంచుకుంది. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో జరిగిన సమంత వివాహం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సమంత పెట్టి ఇన్‌స్టా స్టోరీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Published on: Dec 4, 2025, 10:44:45 IST
Advertisement

హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరుతో సమంత వివాహం డిసెంబర్ 1న జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన రెండో పెళ్లికి సంబంధించిన ఫొటోలను, అనుభూతులను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది సమంత.

చమత్కారమైన పోస్ట్

ఇకనుంచి నేను అతని సమస్య.. రెండో పెళ్లి తర్వాత డెవిల్ ఎమోజీతో సమంత పోస్ట్.. ఎవరి గురించి అంటే?
ఇకనుంచి నేను అతని సమస్య.. రెండో పెళ్లి తర్వాత డెవిల్ ఎమోజీతో సమంత పోస్ట్.. ఎవరి గురించి అంటే?

తాజాగా సమంత ఒక చమత్కారమైన వ్యాఖ్యతో ఇన్‌స్టా స్టోరీ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసిన సమంత దానికి సార్కాస్టిక్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఆ ఫొటోలో రాజ్ నిడిమోరును సమంత నవ్వుతూ చూస్తూ ఉంది. చేతిలో పూలదండ పట్టుకుని నవ్వుతూ సమంత కనిపించింది.

రాక్షసి ఎమోజీ

"ఇకనుంచి మీరు అతని సమస్య అని మీరు భావించినప్పుడు" అంటూ రాసుకొచ్చిన సమంత పర్పుల్ కలర్‌లో ఉన్న డెవిల్ (రాక్షసి) ఎమోజీని యాడ్ చేసింది. అంటే, ఇకనుంచి తాను రాజ్ నిడిమోరు సమస్య, బాధ్యత అని చమత్కారంగా చెప్పింది సమంత.

సమంత పెళ్లి క్యాండిడ్స్

ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అలాగే, సమంత, రాజ్ మధ్య ఉన్న బంధాన్ని చెబుతోంది. ఇదే కాకుండా చాలా ఫొటోలను సమంత షేర్ చేసింది. అందులో సమంత చాలా ఆనందంగా కనిపించింది. అలాగే, సమంత పెళ్లిలోని క్యాండిడ్ ఫొటోలను పంచుకుంది హీరోయిన్ ఫ్రెండ్ మేఘన వినోద్.

మెహందీ నుంచి

అందులో సమంతను పెళ్లి కూతురుని చేయడం నుంచి రాజ్ నిడిమోరు తాళి కట్టేవరకు ఉన్నాయి. చేతులకు మెహందీతో పెట్టుకుని సంతోషంగా నవ్వుతున్న సమంత ఫొటోలు కూడా అందరిని అట్రాక్ట్ చేశాయి.

లింగ భైరవ వివాహం

ఇప్పుడు సమంత, రాజ్ నిడిమోరు రెండో వివాహంతో వీరి బంధంపై పలు విధాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఇద్దరి గతం గురించి చూస్తే.. నాగ చైతన్యను 2017లో పెళ్లి చేసుకున్న సమంత 2021 వరకు కలిసి ఉన్నారు. అనంతరం సమంత, నాగ చైతన్యకు విడాకులు అయ్యాయి.

Samantha's Insta Story.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఓటీటీ సిరీసుతో

మరోవైపు రాజ్ నిడిమోరు 2015లో శ్యామాలి డేను వివాహం చేసుకున్నాడు. వారిద్దరు 2022లో విడిపోయారు. 2021లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఓటీటీ సిరీస్‌ కోసం రాజ్, సమంత కలిసి పనిచేశారు. 2024లో రాజ్‌తో సమంత డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా 2025 డిసెంబర్ 1న ఆ పుకార్లను నిజం చేస్తూ సమంత, రాజ్ పెళ్లి చేసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks