...
...
Next Story

Sandeep Reddy Vanga: ఈ సినిమా కోసం 3 గంటలు కేటాయించండి.. ఇదో అరుదైన చిత్రం.. ప్యూర్ ఫిల్మ్ మేకింగ్: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ తెలుగు సినిమాకు ఫిదా అయ్యాడు. ఇదో అరుదైన చిత్రమని ప్రశంసలు కురిపించాడు. ప్రతి మూవీ లవర్ ఈ ఫిల్మ్ కోసం 3 గంటలు కేటాయించాలని రిక్వెస్ట్ చేశాడు. అసలు అది ఏ సినిమా? దానికి మహేష్ బాబుకు ఉన్న కనెక్షన్ ఏంటీ? అనేది ఇక్కడ చూసేయండి.

Published on: Jul 14, 2026, 10:34:02 IST
Advertisement

Sandeep Reddy Vanga: టాలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా, రియలిస్టిక్ కథలతో ప్రయోగాలు చేసే అతికొద్ది మంది దర్శకులలో వెంకటేష్ మహా ఒకరు. ఆయన సత్యదేవ్‌తో కలిసి తెరకెక్కించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘రావు బహదూర్’. థియేటర్లలో క్లాస్ ఆడియన్స్‌ను కదిలిస్తున్న ఈ చిత్రానికి ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నుంచి ఊహించని మద్దతు లభించింది.

సందీప్ రెడ్డి వంగా ఫిదా

ఈ సినిమా కోసం 3 గంటలు కేటాయించండి.. ఇదో అరుదైన చిత్రం.. ప్యూర్ ఫిల్మ్ మేకింగ్: సందీప్ రెడ్డి వంగా (x)
ఈ సినిమా కోసం 3 గంటలు కేటాయించండి.. ఇదో అరుదైన చిత్రం.. ప్యూర్ ఫిల్మ్ మేకింగ్: సందీప్ రెడ్డి వంగా (x)

సాధారణంగా సందీప్ రెడ్డి వంగా సినిమాలు లార్జర్ ద్యాన్ లైఫ్ క్యారెక్టరైజేషన్స్‌తో, ఇంటెన్స్ వయలెన్స్‌తో ఉంటాయి. కానీ వెంకటేష్ మహా శైలి పూర్తిగా భిన్నం. అత్యంత సహజంగా, సమాజంలోని పాత్రలను స్క్రీన్‌పై చూపిస్తూ డ్రామాను పండించడం మహా స్పెషాలిటీ. ఇలాంటి విభిన్న శైలి కలిగిన డైరెక్టర్ తెరకెక్కించిన ‘రావు బహదూర్’ చూసి సందీప్ వంగా ఎమోషనల్ కావడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

3 గంటల సమయం

సందీప్ రెడ్డి వంగా ఈ రావు బహదూర్ చిత్రం కోసం వెంకటేష్ మహా చూపించిన ‘జీరో కాంప్రమైజ్’ టేకింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. పరిమిత బడ్జెట్‌లో, ఎలాంటి సినిమాటిక్ షార్ట్‌కట్స్ తీసుకోకుండా కథను నమ్మిన విధానం తనను ఆకట్టుకుందని సందీప్ పేర్కొన్నాడు.

"మనం సినిమాను మొదటిసారి ఎందుకు అమితంగా ప్రేమించామో గుర్తుచేసే అత్యంత అరుదైన, సుసంపన్నమైన చిత్రాలలో రావు బహదూర్ ఒకటి" అంటూ సందీప్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ చిత్రం ప్రేక్షకుల శ్రద్ధకు, ఓపికకు, చప్పట్లకు కచ్చితంగా అర్హమైనదని చెబుతూ.. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక 3 గంటల సమయాన్ని ఈ చిత్రం కోసం కేటాయించాలని సందీప్ రిక్వెస్ట్ చేశాడు.

మహేష్ బాబు సపోర్ట్

రావు బహదూర్ సినిమాలో సత్యదేవ్ తన అద్భుతమైన నటనతో వన్-మ్యాన్ షో చేయగా.. దీపా థామస్ కీలక పాత్రలో మెప్పించింది. స్మరన్ అందించిన సంగీతం, కార్తీక్ సినిమాటోగ్రఫీ సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. సందీప్ రెడ్డి వంగా వంటి పెద్ద డైరెక్టర్ ప్రమోషన్స్ బాధ్యతను భుజాన వేసుకోవడంతో ఈ వీకెండ్‌లో ‘రావు బహదూర్’ బాక్సాఫీస్ వద్ద మరింత స్ట్రాంగ్ రన్ సాధించే అవకాశం కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe