...
...
Next Story

Sandeep Reddy Vanga: వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు-సందీప్ రెడ్డి వంగా రిక్వెస్ట్‌-సీఎం రేవంత్ డైలాగ్‌కు స‌ర్‌ప్రైజ్‌!

Sandeep Reddy Vanga: సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎక్స్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరంగల్ ఎయిర్ పోర్టుకు సందీప్ పేర్లు సజెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగ్ కు సందీప్ సర్ ప్రైజ్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

Published on: Sep 19, 2026, 21:50:24 IST
Advertisement

Sandeep Reddy Vanga: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఎక్స్ టాక్ వైరల్ గా మారింది. వరంగంలోని మామనూరు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ పూర్తయిందని రేవంత్ రెడ్డి ఎక్స్ లో ప్రకటించారు. దీనికి స్పందించిన సందీప్ రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ రెడ్డి ప్రకటన

వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు-సందీప్ రెడ్డి వంగా రిక్వెస్ట్‌-సీఎం రేవంత్ డైలాగ్‌కు స‌ర్‌ప్రైజ్‌! (x)
వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు-సందీప్ రెడ్డి వంగా రిక్వెస్ట్‌-సీఎం రేవంత్ డైలాగ్‌కు స‌ర్‌ప్రైజ్‌! (x)

వరంగల్ లోని మామనూర్ ఎయిర్ పోర్టు దిశగా కీలక అడుగు పడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తయిందని రేవంత్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు. అందుకోసం రూ.295 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. ఈ భూమిని ఇండియా ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి అప్పగించినట్లు తెలిపారు.

పేర్లు సూచించాలని

వరంగల్ లో నిర్మాణమయ్యే ఎయిర్ పోర్టుకు పేర్లు సూచించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా రియాక్టవుతున్నారు. ఎయిర్ పోర్టుకు పేర్లను సూచిస్తున్నారు.

సందీప్ రియాక్షన్

సందీప్ రెడ్డి వంగా పోస్టుకు రేవంత్ రెడ్డి రిప్లే ఇచ్చారు. ‘దట్ ఈజ్ ది స్పిరిట్’ అని పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి రిప్లే చూసి సందీప్ వంగా సర్ ప్రైజ్ అయినట్లు చెప్పారు.

‘‘నా సినిమా స్పిరిట్ లో సరిగ్గా ‘దట్ ఈజ్ ది స్పిరిట్’ అనే లైన్ రాశా. మీ నుంచి ఈ లైన్ రావడంతో సర్ ప్రైజ్ అయ్యా. సరిగ్గా ఇదే లైన్ రాసిన నేను ఎంతో ఎగ్జైట్ అవుతున్నా. సరైన వ్యక్తి నుంచి వచ్చే కొన్ని పదాలు డిఫరెంట్ గా ఉంటాయి’’ అని సందీప్ వంగా మళ్లీ పోస్టు పెట్టారు.

స్పిరిట్ గురించి

సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్. ఈ సినిమాను 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఆ దిశగా మూవీ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks