Today OTT: దేవుళ్లు పారిపోయారా? క్వారంటైన్‌లో మొద‌లైన ప్రేమ‌-ఇవాళ నేరుగా ఓటీటీలోకి వ‌చ్చిన ల‌వ్ ఎమోష‌న‌ల్ డ్రామా

ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు సినిమా డైరెక్ట్ గా రిలీజైంది. ఎప్పుడో షూటింగ్ మొదలెట్టుకున్న ఈ మూవీ కొన్నేళ్ల తర్వాత నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. కరోనా, క్వారంటైన్, లాక్ డౌన్ టైమ్ లో తీసిన లవ్ ఎమోషనల్ డ్రామా ఇది.

Published on: Jan 22, 2026, 10:36:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్నేళ్ల క్రితం షూటింగ్ మొదలెట్టుకున్న వివిధ కారణాల వల్ల ఆలస్యమైన సినిమాలు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. కరోనా టైమ్ లో అప్పటి పరిస్థితుల్లో లవ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ‘సంధ్యానామ ఉపాసతే’ మూవీ పరిస్థితి కూడా అలాంటిదే. 2022లో షూటింగ్ మొదలెట్టుకున్న మూవీ ఇన్నేళ్లకు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన తెలుగు లవ్ ఎమోషనల్ మూవీ (x/etvwin)
ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన తెలుగు లవ్ ఎమోషనల్ మూవీ (x/etvwin)

సంధ్యానామ ఉపాసతే ఓటీటీ

తెలుగులో వచ్చిన లవ్ ఎమోషనల్ డ్రామా సంధ్యానామ ఉపాసతే. ఈ చిత్రం ఇవాళ (జనవరి 22) డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. మనసుకు హత్తుకునే సీన్లతో సాగుతోంది ఈ మూవీ. కరోనా టైమ్ లోని పరిస్థితులను కళ్లకు కట్టింది సంధ్యానామ ఉపాసతే సినిమా.

అసలు మతమే లేని ఒక దేశం విసిరిన కరోనా బాంబ్ ఇన్ని మతాలు, మందిరాలు ఉన్న దేశం మీద పడి అల్లకల్లోలం అవుతుంటే అందులో ఉన్న దేవుళ్లు ఏం చేస్తున్నారు సార్, దేవుళ్లు పారిపోయారా? అనే సినిమాలోని డైలాగ్ ఆకట్టుకుంటోంది.

నేరుగా ఓటీటీలోకి

కరోనా అందరి జీవితాలను ఏదో రకంగా ప్రభావితం చేసింది. వైరస్ సోకుతుందేమోనన్న భయం, కరోనా వస్తే చనిపోతామేమోననే ఆందోళన.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో భయపడ్డవాళ్లే. అప్పటి క్వారంటైన్, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ సంధ్యానామ ఉపాసతే. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసుకున్నా వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీంతో థియేటర్లలోకి కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది.

సంధ్యానామ ఉపాసతే సినిమాలో వంశీ, క్రిస్టెన్ రవళి ప్రధాన పాత్రలు పోషించారు. దీప్తి వర్మ, పోసాని, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించారు. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్టర్ ప్రొమో భాస్కర్. ఈ సినిమాను సుబ్రహ్మణ్యం రాజు, చంద్రశేఖర్ ప్రసాద్, వీర వెంకట సత్య నారాయణ నిర్మించారు.

సంధ్యానామ ఉపాసతే స్టోరి

క్వారంటైన్, లాక్ డౌన్, వ్యాక్సిన్.. కరోనా కారణంగా ఈ పదాలు అందరికీ పరిచయమయ్యాయి. కరోనా సమయంలోని పరిస్థితుల మధ్య సాగే కథనే సంధ్యానామ ఉపాసతే. ఇప్పుడు ఇది ఔట్ డేటెడ్ స్టోరీనే. కానీ మరోసారి ఆ కరోనా టైమ్ లోని నొస్టాల్జియా మాత్రం కనెక్ట్ అవుతుంది.

ఉదయ్, సంధ్య క్వారంటైన్ రూమ్ లో కలుసుకుంటారు. వీళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. లాక్ డౌన్ లో నిర్మానుష్యమైన రోడ్ల మీద ఈ జోడీ బండి వేసుకుని చక్కర్లు కొడుతోంది. మరి వీళ్ల ప్రేమకు ఎలాంటి ముగింపు దక్కింది? కరోనా కారణంగా జనాల మానసిక ఆవేదన ఎలా ఉండేది? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More