...
...
Next Story

Sanjay Dutt: దేశంలో శాంతి, ప్రశాంతత లేదు- 5 నిమిషాల ప్రధానిగా సంజయ్ దత్ కామెంట్స్- క్లారిటీ ఇచ్చిన ది రాజా సాబ్ విలన్

Sanjay Dutt Clarifies Comments On Peace In India: దేశంలో ప్రశాంతత, శాంతి కొరవడిందంటూ సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన సంజయ్ దత్ స్క్రిప్ట్ ప్రకారమే 'మున్నాభాయ్' శైలిలో సరదాగా మాట్లాడానని, ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.

Published on: Oct 5, 2026, 17:02:22 IST
Advertisement

Sanjay Dutt Clarifies Comments On Peace In India: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ నిర్వహించిన'శేఖర్ టునైట్' టాక్ షోలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దేశంలో ప్రశాంత వాతావరణం కనిపించడం లేదంటూ ఆయన మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

అసలేం జరిగింది? వివాదానికి కారణమేంటి?

దేశంలో శాంతి, ప్రశాంతత లేదు- 5 నిమిషాల ప్రధానిగా సంజయ్ దత్ కామెంట్స్- క్లారిటీ ఇచ్చిన ది రాజా సాబ్ విలన్

(File Photo/ PTI)
దేశంలో శాంతి, ప్రశాంతత లేదు- 5 నిమిషాల ప్రధానిగా సంజయ్ దత్ కామెంట్స్- క్లారిటీ ఇచ్చిన ది రాజా సాబ్ విలన్ (File Photo/ PTI)

పరిస్థితి విషమించడంతో ఈ అంశంపై సంజయ్ దత్ సోషల్ మీడియా వేదికగా తాజాగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. టాక్ షో సంభాషణలో భాగంగా దేశ ప్రస్తుత పరిస్థితులపై సంజయ్ దత్ మాట్లాడారు.

"మన దేశ ప్రజలు చాలా మంచివారు, ఎంతో ఆప్యాయత చూపిస్తారు. మనం ఎప్పుడూ ఇతరులకు అండగా నిలుస్తాం. అయితే గతంలో ఉండే ప్రశాంతత ఇప్పుడు దేశంలో నాకు కనిపించడం లేదు. మళ్లీ ఆ మంచి రోజులు తిరిగి రావాలని నేను ఆ పరమశివుడిని ప్రార్థిస్తున్నాను" అని తన మున్నాభాయ్ మార్క్ హాస్యంతో వ్యాఖ్యానించారు.

ఐదు నిమిషాల పాటు దేశ ప్రధానిగా

దీనికి తోడు, షోలో ఒక ఆసక్తికరమైన టాస్క్ చేశారు. ఐదు నిమిషాల పాటు దేశ ప్రధానిగా ఊహించుకుని ప్రజలకు ఏం చెబుతారని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సంజయ్ దత్ తన సొంత శైలిలో సమాధానమిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. "దేశంలో ఇంత మంది ప్రజలు ఉన్నారు. ఈ బాధ్యతంతా నాపై ఉంది. మీరు ఏమాత్రం కంగారు పడకండి. ఈ సంబరాలు చేసుకోవడానికి నేను విదేశాలకు వెళ్లను. మీ మధ్యనే ఉంటాను. లేకపోతే ప్రధానికి, ప్రజలకు మధ్య సంబంధం ఎలా ఉంటుంది?" అంటూ మున్నాభాయ్ హిందీ డైలాగులతో సరదాగా మాట్లాడారు.

దుబాయ్ కనెక్షన్.. సోషల్ మీడియా ట్రోలింగ్

తన వ్యాఖ్యలపై వివాదం ముదరడంతో సంజయ్ దత్ రంగంలోకి దిగి పూర్తి స్పష్టత ఇచ్చారు. "ఏ వ్యక్తి, సమాజం లేదా వ్యవస్థ మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం ఎంతమాత్రం కాదు" అని సంజయ్ దత్ పేర్కొన్నారు. షోలోని సన్నివేశాలు ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం నడిచాయని వివరించారు.

"నా వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం 'మున్నాభాయ్' చిత్రాల్లోని 'గాంధీగిరి' భావన లాంటిదే. ప్రేమ, ఆప్యాయత, ఐక్యత, మంచి భావనలను పంచడమే నా లక్ష్యం. దురదృష్టవశాత్తు నా మాటలను వేరే కోణంలో అర్థం చేసుకున్నారు" అని సంజయ్ దత్ వివరణ ఇచ్చారు.

చివరిగా ఆఖరీ సవాల్ సినిమాలో

ఇటీవల మే నెలలో విడుదలైన పొలిటికల్ డ్రామా 'ఆఖరీ సవాల్' చిత్రంలో సంజయ్ దత్ చివరిగా కనిపించారు. తెలుగులో ప్రభాస్ ది రాజా సాబ్‌లో సంజయ్ దత్ విలన్‌గా మెప్పించిన విషయం తెలిసిందే. సరదా వ్యాఖ్యలు కూడా ఒక్కోసారి పెద్ద చర్చకు దారితీస్తాయని ఈ ఘటన నిరూపించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks