Sanjay Dutt Daughter Trishala Dutt Reveals Bollywood Debut: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, ది రాజా సాబ్ విలన్ సంజయ్ దత్ గారాల పట్టి త్రిషాల దత్ తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా అమెరికాలో స్థిరపడిన త్రిషాల దత్ ఒకప్పుడు తాను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నానని.. కానీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణం 'నటన' కాదని సంచలన విషయాన్ని బయటపెట్టారు.
తండ్రికి దగ్గరవడానికే ఆ ఆలోచన

సంజయ్ దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మ దంపతులకు 1988లో త్రిషాల జన్మించారు. అయితే ఆమె చిన్న వయసులోనే రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్‌తో కన్నుమూయడంతో, త్రిషాల తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద అమెరికాలోనే పెరిగారు. తండ్రికి దూరంగా ఉండటం త్రిషాలను మానసికంగా ఎంతో బాధించేది. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న త్రిషాల తన కెరీర్ ఆరంభంలో ఎదురైన పరిస్థితుల గురించి మాట్లాడారు.
"నేను చిన్నప్పుడు బాలీవుడ్‌లోకి వెళ్లాలని ఆలోచించాను. అయితే అది నటన మీద ఉన్న మక్కువతో కాదు.. కేవలం నా తండ్రికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను" అని త్రిషాల దత్ పేర్కొన్నారు. తన తండ్రితో ఎక్కువ సమయం గడపడానికి సినిమా పరిశ్రమ ఒక్కటే మార్గమని ఆ వయసులో ఆమె భావించినట్లు తెలుస్తోంది.
తండ్రి ఇచ్చిన సలహా.. కెరీర్ మలుపు
ఒకవైపు బాలీవుడ్ వెండితెర ఆహ్వానిస్తున్నా, సంజయ్ దత్ మాత్రం తన కుమార్తెకు వాస్తవాలను వివరించారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు చూసిన సంజయ్.. త్రిషాల నిర్ణయాన్ని తప్పుబట్టకుండానే ఆమెలో ఉన్న అసలు ఆసక్తిని వెలికితీసే ప్రయత్నం చేశారు.
"సినిమాల్లోకి రావడం నీ ఆలోచననేనా? నీ మనసు నిజంగా అటువైపే ఉందా?" అని సంజయ్ దత్ తనను అడిగినట్లు త్రిషాల గుర్తు చేసుకున్నారు. "నువ్వు ఫలానా వ్యక్తి కూతురివి అయినంత మాత్రాన ఇక్కడ ఆఫర్లు క్యూ కడతాయని, నువ్వు స్టార్ హీరోయిన్ అయిపోతావని అనుకోవద్దు. నీకు నచ్చిన రంగం ఏంటో ఆలోచించు" అని ఆయన హితబోధ చేశారట.
మానసిక వైద్యురాలిగా కొత్త ప్రయాణం
{{/usCountry}}"సినిమాల్లోకి రావడం నీ ఆలోచననేనా? నీ మనసు నిజంగా అటువైపే ఉందా?" అని సంజయ్ దత్ తనను అడిగినట్లు త్రిషాల గుర్తు చేసుకున్నారు. "నువ్వు ఫలానా వ్యక్తి కూతురివి అయినంత మాత్రాన ఇక్కడ ఆఫర్లు క్యూ కడతాయని, నువ్వు స్టార్ హీరోయిన్ అయిపోతావని అనుకోవద్దు. నీకు నచ్చిన రంగం ఏంటో ఆలోచించు" అని ఆయన హితబోధ చేశారట.
మానసిక వైద్యురాలిగా కొత్త ప్రయాణం
{{/usCountry}}ఈ చర్చ తర్వాతే తాను సినీ గ్లామర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు త్రిషాల దత్ వెల్లడించారు. సొంతంగా ఎదగాలనే పట్టుదలతో త్రిషాల అమెరికాలో చదువుకుని నేడు విజయవంతమైన సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యురాలు)గా రాణిస్తున్నారు. తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులే ఆమెను ఇతరుల మానసిక సమస్యలను పరిష్కరించే దిశగా నడిపించాయి.
"ప్రతి ఒక్కరికీ అంతర్గత పోరాటాలు ఉంటాయి. అందరూ అన్ని వేళలా ధైర్యంగా ఉండలేరు. ఒత్తిడిలో ఉన్నవారికి 'నేను ఉన్నాను' అని చెప్పడానికే నేను థెరపిస్ట్‌గా మారాను. బాలీవుడ్ కుటుంబం నుంచి వచ్చిన వారెవరూ మానసిక ఆరోగ్యం గురించి పెద్దగా మాట్లాడటం నేను చూడలేదు. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా జీవితం ఎప్పుడూ పూలబాటలా ఉండదు. అందరం మనుషులమే అన్న విషయాన్ని గుర్తు చేయడమే నా లక్ష్," అని త్రిషాల చెప్పిన మాటలు ఆదర్శవంతంగా ఉన్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. త్రిషాల దత్ ఎవరు?
త్రిషాల దత్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మల కుమార్తె. ఆమె ప్రస్తుతం అమెరికాలో మానసిక వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
2. త్రిషాల దత్ బాలీవుడ్‌లోకి ఎందుకు రాలేదు?
ఆమెకు నటనపై ఆసక్తి లేకపోవడం, తండ్రి సంజయ్ దత్ ఇచ్చిన సలహా మేరకు ఆమె తనకు ఇష్టమైన వైద్య వృత్తిని ఎంచుకున్నారు. కేవలం తండ్రికి దగ్గరవ్వడం కోసమే సినిమాల్లోకి రావాలని ఒకప్పుడు అనుకున్నట్లు ఆమె తెలిపారు.
3. సంజయ్ దత్ కుమార్తె ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?
త్రిషాల చిన్నతనం నుంచే అమెరికాలో తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. ప్రస్తుతం అక్కడే సైకియాట్రిస్ట్‌గా స్థిరపడ్డారు.
4. త్రిషాల తల్లి రిచా శర్మ ఎలా మరణించారు?
త్రిషాల తల్లి రిచా శర్మ 1996లో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించారు.